https://oktelugu.com/

ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఏం చర్చించారు?

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ బ్రేక్ వేసింది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ బీజేపీపై కన్నెర్ర చేశారు. భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సడెన్ గా సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరారు. Also Read: ఉత్తరాంధ్ర వేదికగా నూతన శకానికి ‘బిజ్ కాన్’ నాంది గత రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మకాం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 12, 2020 / 09:37 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ బ్రేక్ వేసింది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ బీజేపీపై కన్నెర్ర చేశారు. భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే సడెన్ గా సీఎం కేసీఆర్ ఢిల్లీకి చేరారు.

    Also Read: ఉత్తరాంధ్ర వేదికగా నూతన శకానికి ‘బిజ్ కాన్’ నాంది

    గత రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. నిన్నంతా పలువురు కేంద్ర మంత్రులతో బీజీబీజీగా గడిపారు. హోంమంత్రి అమిత్ షాతో కేసీఆర్ భేటీ అయి వరద సాయం నిధులు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

    శనివారం కేంద్ర మంత్రి హార్దీప్‌సింగ్ పురీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఆరు ఎయిర్‌పోర్టులకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అదేవిధంగా ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ఆయనకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

    ఢిల్లీ పర్యటనకు ముందే తెలంగాణ సీఎంవో ప్రధాని అపాయింట్ కోరింది. అయితే ప్రధానితో బేటి ఉంటుందా? ఉండదా? అనే సస్పెన్స్ కొనసాగింది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ తాజాగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు.

    Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. పోటీకి నై అంటున్న జానారెడ్డి..!

    కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. విభజన చట్టంలోని పలు అంశాలపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం.. పాలమూరు-రంగారెడ్డి.. డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు.. జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

    దీంతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం కోరినట్లు సమాచారం. కేంద్రం స్పందించి వెంటనే తక్షణ నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని కోరినట్లు సమాచారం. మొత్తానికి ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ అవుతారా? లేదా అనే సస్పెన్స్ కు వీరిద్దరి భేటితో తెరపడింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్