ప్రపంచంలో మేజర్ సమస్య ఏదైనా ఉందంటే అది నిరుద్యోగమే. మూడు పదుల వయసు దాటినా జాబ్ దొరక్క.. జుట్టు ఊడిపోయి .. ఉద్యోగం కోసం పెళ్ళిని వాయిదా వేసేవారు ఎందరో మన సమాజంలో ఉన్నారు. భారతదేశంలో యువత జనాభా ఎక్కువగా ఉంది. ఈ యువతను సరైన రీతిలో వినియోగించుకుంటే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం ఖాయం. అలాంటి ఆలోచనలతోనే ‘బిజ్ కాన్’ సంస్థ నేడు ఉత్తరాంధ్రలో ప్రారంభించబడింది. యువతకు స్వయం ఉపాధి కల్పించడంతోపాటు.. పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంతో ‘బిజ్ కాన్’ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది.
Also Read: ఏలూరు రిపోర్ట్ : నీళ్లు కారణం కాదట!
దీనిలో భాగంగానే నేడు ప్రముఖ రాజకీయ నాయకుడు, సామాజిక వేత్త మారిశెట్టి రాఘవయ్య అధ్యక్షతన నెక్ట్స్ జెన్ సంస్థ ఆధ్యర్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విశాఖపట్టణంలోని సరిపల్లి భాష్యం స్కూల్ మైదానంలో ‘బిజ్ కాన్- 2020’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేధావి, సామాజిక వేత్త, అంతర్జాతీయ వక్త రచయిత రాజు రవితేజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాఘవయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో 60శాతం పైగా యువత ఉన్నారని.. వారందరికీ సరిపడే స్థాయిలో ఉద్యోగాలు లేవన్నారు. యువత ఉద్యోగాలు కోసం చూసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. యువతను అలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బిజ్ కాన్ సంస్థ పని చేస్తుందని తెలిపారు.
ఈ సదస్సులో అంతర్జాతీయ వక్త, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వవికాస నిపుణులు రాజు రవితేజ్ మాట్లాడుతూ యువత తల్చుకుంటే ఏదైనా సాధించగలరని తెలిపారు. వారిలోని అపారమైన శక్తిని బయటికి తీసుకొచ్చే బాధ్యతను బిజ్ కాన్ సంస్థ తీసుకుంటుందని తెలిపారు. అనంతరం యువతకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా కోశ్చన్ అండ్ అన్సర్ సెషన్ ను నిర్వహించారు.
Also Read: భూములు అమ్మేస్తున్న సర్కారు..!
అనంతరం MSME అసిస్టెంట్ డైరెక్టర్ రఘురాం తమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న పలు పథకాలు.. రాయితీలను వివరించారు. మేకింగ్ ఇండియా.. ముద్ర లోన్స్.. మిగతా స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించారు. యువత ఈ అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో MSME డిప్యూటీ డైరెక్టర్ కలేబు.. NRDC మాజీ చైర్మన్ హెచ్.పురుషోత్తం.. అల్ట్రా డైమెన్షన్స్ ఎండీ. త్రినాధరావు.. ఇన్‌స్పైర్ ఎడ్జ్ సీఓఓ నరేంద్ర నేర్ల.. రాయల్ నిర్మాణ్ ప్రతినిధులు ఎం.రాజు, వై.ఎం.రావు.. రామకృష్ణ.. ఎంఎస్ఈ డీఐ రఘరాం.. సిడ్బీ ఏజీఎం డాక్టర్ మాకెన సతీష్.. నెక్ట్స్ జెన్ ప్రతినిధులు పవన్, దేవా.. శ్రీకాంత్.. వర్షిణి. కుషాల్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్