జగన్ ఆ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాడా..?

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేపడుతున్నారు. అప్పటి వరకు ఉన్న కొన్ని వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్దుతూ ముందుకు వెళుతున్నారు. తాజాగా బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు తెచ్చి ప్రజలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో జగన్ కొన్నిమార్గదర్శకాలు సూచించారు. అయితే మిగతా రంగాలను కంట్రోల్ చేసిన విధంగా బ్యాంకింగ్ వ్యవస్థను అదుపులో పెట్టుకోవడం సాధ్యమవుతుందా..? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. Also Read: ప్రధాని మోదీతో […]

Written By: NARESH, Updated On : December 13, 2020 12:37 pm
Follow us on

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేపడుతున్నారు. అప్పటి వరకు ఉన్న కొన్ని వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్దుతూ ముందుకు వెళుతున్నారు. తాజాగా బ్యాంకింగ్ రంగంలో సమూల మార్పులు తెచ్చి ప్రజలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో జగన్ కొన్నిమార్గదర్శకాలు సూచించారు. అయితే మిగతా రంగాలను కంట్రోల్ చేసిన విధంగా బ్యాంకింగ్ వ్యవస్థను అదుపులో పెట్టుకోవడం సాధ్యమవుతుందా..? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

Also Read: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం కేసీఆర్.. ఏం చర్చించారు?

రైతులకు, చిరు వ్యాపారులకు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో బ్యాంకులు కఠినంగా ఉంటాయి. పెద్ద పెద్ద వ్యాపారులకు అడగకముందే మితిమీరిన అప్పులు ఇచ్చి దీవాలా తీస్తుంటూ పేదల పట్ల మాత్రం సీరియస్ గా ఉంటారు. బ్యాంకులు ఉదారంగా ఉంటేనే రుణ పరిమితి పెరిగి బ్యాంకులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకులు మాత్రం పరిమిత రుణాలు ఇస్తూ అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ సబ్సిడీ పొందే వారి విషయంలోనూ బ్యాంకులు వడ్డీ విషయంలో కర్కశంగా ఉండడంతో పలువురు అప్పుల పాలవుతున్నారు.

ఉదాహరణకు స్వయం సహాయక సంఘాల నుంచి ప్రతి ఏటా బ్యాంకుల్లో 7500 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఇందుకు పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకులు ఇచ్చే వడ్డీ కేవలం 3 శాతమే. అదే బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే 11 నుంచి 13 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. ఈ వ్యవస్థను చక్కదిద్దడానికి జగన్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారితో సమావేశమై పలు సూచనలు చేశారు.

Also Read: ఉత్తరాంధ్ర వేదికగా నూతన శకానికి ‘బిజ్ కాన్’ నాంది

నెలానెలా పొదుపు సంఘాలు బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తుంటే వారి పట్ల ఉదారంగా వ్యవహరించకపోతే ఎలా..? అని జగన్ ప్రశ్నించారు. రుణాలను రీస్ట్రక్చర్ చేసి ఔత్సాహిక గ్రామీణ పారిశ్రామిక వేత్తలను ఆదుకోవాలన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని, రైతుల ఆదాయం రెట్టింపుపై బ్యాంకులు ద్రుష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం వడ్డీ లేకుండా రూ. 10వేలు ఇస్తుందని వారికి బ్యాంకులు మరింత అండగా ఉండాలన్నారు.

అయితే ఇన్నాళ్లు నాయకులు బ్యాంకుల ద్వారా తమకు కావాల్సిన పనులు చేయించుకొని ఇప్పుడు పేదల పక్షాల మాట్లాడడంపై బ్యాంకు అధికారులు అయోమయానికి గురయ్యారు. అయితే జగన్ అనుకున్నంత సులువుగా బ్యాంకింగ్ వ్యవస్థలు మార్పులు తీసుకురావడం సాధ్యం కాదంటున్నారు. ఈ వ్యవస్థ జగన్ చేతిలో ఉండదని ప్రతీ బ్యాంకు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే పనిచేస్తుందని కొందరు అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్