ఉన్నది పాయే.. ఉంచుకున్నది పాయే అన్న చందంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గట్టి షాక్ తగిలింది. ఇన్నాళ్లు దేన్ని బేస్ చేసుకొని కేంద్రంలో చక్రం తిప్పిన నర్సాపురం ఎంపీకి ఇప్పుడు అదే లేకుండా చేసింది వైసీపీ అధిష్టానం.. జగన్ కొట్టిన దెబ్బకు ఇప్పుడు పోస్ట్ ఊస్ట్ అయ్యి రఘురామకృష్ణంరాజు షాక్ కు గురయ్యారు. వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఢిల్లీలో రఘురామను ఒక సాధారణ ఎంపీగా మార్చేసింది.
Also Read: కులాలకు చెల్లు.. జగన్ మరో సంచలన నిర్ణయం
కేంద్రం స్టాండింగ్ కమిటీ చైర్మన్ చక్రం తిప్పి బీజేపీ పెద్దలతో రాసుకుపూసుకు తిరుగుతూ వైసీపీని, వైఎస్ జగన్ ను తిట్టిపోసిన రఘురామ ఆటకట్టైంది. రఘురామ పోస్ట్ ను వైసీపీ అధిష్టానం ఊస్ట్ చేసింది.
వైసీపీ ఎంపీగా రఘురామకృష్ణం రాజు ఉంటూ ఆయనకు కేంద్రంలో దక్కిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తాజాగా ఆయనను తప్పించారు. ఇక రఘురామకృస్ణం రాజు స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరికి ఆ పోస్టును కట్టబెట్టారు. దీంతో ఇంతకాలం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా వ్యవహరించిన రఘురామకృష్ణంరాజు ఆ పదవి కోల్పోయినట్లైంది. ఆయనకు ఇన్నాళ్లు ఈ పోస్టుతో వచ్చిన వై కేటగిరి భద్రత కూడా పోనుంది.
Also Read: ఒక్క వర్షం.. పదుల సంఖ్యలో ప్రాణాలు..
జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే రఘురామ పోస్ట్ ఊస్ట్ కావడం విశేషం. అక్టోబర్ 9 నుంచే ఈ మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇన్నాళ్లు ఈ పదవితో కేంద్రంలో చక్రం తిప్పిన రఘురామకు వైసీపీ గట్టి షాక్ ఇచ్చినట్టైంది. ఇక ఆయనపై అనర్హత వేటు వేయించే దిశగా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.