మెగాస్టార్ చిరంజీవి 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలోనే నంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ లను ఆయనే సాకారు. ఆ టైంలో మొత్తం కుటుంబం బాధ్యతను తన నెత్తిన పెట్టుకున్నాడు.
Also Read: ట్రైలర్ టాక్: ‘బంగారు బుల్లోడు’గా నరేశ్ అల్లరి
ఇక తాజాగా సోషల్ మీడియాలోనూ చిరంజీవి తెగ యాక్టివ్ అయ్యారు. తను హీరోగా ఉన్నప్పుడు దిగిన పాత ఫొటోలను షేర్ చేస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు.
తాజాగా తలుపులు పైకిలేసి వెళ్లే ఓ సూపర్ కారుముందు ఠీవీగా నిలబడి ఉన్న చిరంజీవి ఫొటోను షేర్ చేశాడు. అయితే చిరంజీవి ఒడిలో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు ఎవరని అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు.
Also Read: సురేఖా వాణిని ఈ ఫొటో చూశాక ఆంటీ అని అనరు
ఈరోజు వరుణ్ తేజ్ జన్మదినం సందర్భంగా ఈ అరుదైన ఫొటోను షేర్ చేసిన చిరంజీవి.. ఈ సందర్భంగా తన తమ్ముడి కొడుకు , హీరో వరుణ్ కు మనసారా శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్