https://oktelugu.com/

‘మాస్టర్’ మూవీ వసూళ్లు చూస్తే షాకే..

ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఇందులో విజయ్ కు పోటీగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాజాగా రిలీజైన సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. తమిళ హీరో కార్తీతో ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్’ మూవీని తెరకెక్కించాడు. విజయ్ కు జోడీగా మాళవికా మోహనన్ నటిస్తోంది. అర్జున్ దాస్.. […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 / 10:51 PM IST
    Follow us on

    ఇళయ దళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఇందులో విజయ్ కు పోటీగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగా తాజాగా రిలీజైన సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.

    తమిళ హీరో కార్తీతో ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘మాస్టర్’ మూవీని తెరకెక్కించాడు. విజయ్ కు జోడీగా మాళవికా మోహనన్ నటిస్తోంది. అర్జున్ దాస్.. సిమ్రన్.. భాగ్యరాజ్.. ఆండ్రియా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

    తెలుగులో విడుదలైన క్రాక్, రెడ్ లాంటి సినిమాల ప్రీ రీలీజ్ బిజినెస్ 20 కోట్లు మాత్రమే. కానీ మాస్టర్ సినిమా బిజినెస్ దాదాపు 200 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 13 న విడుదలైన మాస్టర్ కు వసూళ్లు ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.

    తమిళనాడులో దాదాపు 550 థియేటర్ల లో ఈ సినిమా విడుదల అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 800 థియేటర్ల లో సినిమా విడుదల అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాకు విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

    అయితే మాస్టర్ సినిమా కేవలం తమిళనాడు వరకే మూడు రోజుల్లో యాభై కోట్లు వసూలు చేసింది. మరి ఇప్పటి వరకు దాదాపుగా 150 కోట్లు మార్క్ ను దాటిందని అందరూ అనుకుంటున్నారు మాస్టర్ కు భారీగా వసూళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది.