https://oktelugu.com/

ఏపీకి చిరంజీవి.. ఊగిపోతున్న ఫ్యాన్స్

మన టాలీవుడ్ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని అందమైన లోకేషన్లు ఉన్నా సరే.. వాటిని కాదని విదేశాలకు, కేరళ వంటి రాష్ట్రాలకు తరలిపోతుంటారు. నిర్మాతలకు బడ్జెట్ పెంచుతుంటారు. కానీ కరోనా కల్లోలంలో ఇప్పుడు ఔట్ డోర్ కంటే ఇన్ డోర్ బెటర్ అని హీరోలు నమ్ముతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని లోకేషన్లలోనే మూవీ షూటింగ్ లు తీస్తున్నారు. కేరళలో షూటింగ్ జరుపుకోవాల్సిన ‘పుష్ప’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లా అడవుల్లో చేశారు. రంపచోడవరం, […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2021 / 02:35 PM IST
    Follow us on

    మన టాలీవుడ్ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని అందమైన లోకేషన్లు ఉన్నా సరే.. వాటిని కాదని విదేశాలకు, కేరళ వంటి రాష్ట్రాలకు తరలిపోతుంటారు. నిర్మాతలకు బడ్జెట్ పెంచుతుంటారు. కానీ కరోనా కల్లోలంలో ఇప్పుడు ఔట్ డోర్ కంటే ఇన్ డోర్ బెటర్ అని హీరోలు నమ్ముతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని లోకేషన్లలోనే మూవీ షూటింగ్ లు తీస్తున్నారు.

    కేరళలో షూటింగ్ జరుపుకోవాల్సిన ‘పుష్ప’ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఖమ్మం, తూర్పు గోదావరి జిల్లా అడవుల్లో చేశారు. రంపచోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ చేసిన అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది ఫ్యాన్స్ ఎగబడి షూటింగ్ కు అంతరాయం కలిగించారు.

    ఇప్పుడు బన్నీ బాటలోనే మెగా స్టార్ చిరంజీవి నడుస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను పుష్ప సినిమా కోసం అడవుల్లో వేసిన సెట్ లోనే తీస్తున్నారట.. ఆ అటవీ ప్రాంతంలోనే ఈ షూటింగ్ ను కొనసాగిస్తారట.. ఈ మేరకు ‘ఆచార్య’ సినిమాలోని నక్సల్స్ బ్యాక్ గ్రౌండ్ కోసం చిరంజీవి తూర్పు గోదావరి వస్తున్నారు.

    చిరంజీవి రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగుతున్నాడని తెలియగానే ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి నుంచి కోరుకొండ వరకు ర్యాలీ ప్లాన్ చేశారు. నక్సలైట్ కు సంబంధించిన కొన్ని సీన్లను ఈ అడవుల్లో చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ ఈ సినిమా షూటింగ్ ను అయినా చేస్తారా? లేదా అన్నది చూడాలి.