https://oktelugu.com/

అగ్రరాజ్యాన్ని ముంచెత్తిన మంచు

అగ్రరాజ్యం అమెరికాను హిమబిందు ముంచెత్తింది. అక్కడి చల్లటి వాతావరణంతో ప్రజలు వణికిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించకపోవడంతో అమెరికన్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ చలికాలం నడుస్తున్న నేపథ్యంలో ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. ప్రధాన రహదారులతోపాటు నివాసాల్లో కూడా వస్తువులు మంచుతో గడ్డకట్టుకుని ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా మంచు కప్పేయడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను […]

Written By: Srinivas, Updated On : February 20, 2021 2:33 pm
Follow us on

Snow in America
అగ్రరాజ్యం అమెరికాను హిమబిందు ముంచెత్తింది. అక్కడి చల్లటి వాతావరణంతో ప్రజలు వణికిపోతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించకపోవడంతో అమెరికన్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ చలికాలం నడుస్తున్న నేపథ్యంలో ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. ప్రధాన రహదారులతోపాటు నివాసాల్లో కూడా వస్తువులు మంచుతో గడ్డకట్టుకుని ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా మంచు కప్పేయడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది.

Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి

కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ.. అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఇంకా ఇబ్బందుల నుంచి పూర్తిగా తేరుకోలేదు. అమెరికాలో 3.4 మిలియన్ వినియోగదారులు విద్యుత్ లేకుండానే కాలం వెల్లదీస్తున్నారు. కరెంటుకు తోడు నీటి సరఫరా కూడా నిలిచిపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నీళ్లు పైపులోనే గడ్డకట్టడంతో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కొందరిని ప్రభుత్వం షెల్టర్ హోమ్స్‌కు తరలించింది. నీటి సరఫరా లేక పడుతున్న ఇబ్బందుల గురించి టెక్సాస్ నివాసి తెలుగు వ్యక్తి సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ అయిన మల్లెల నరేష్ వన్ చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం నుంచి టెక్సాస్‌లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో అమెరికా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్ అంధకారంలోకి పోయింది. అక్కడ దాదాపు 3 మిలియన్ గృహాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక టెక్సాస్ ప్రజలు కొందరు తమ నివాసంలో గడ్డకట్టుకుపోయిన వస్తువులను ఫొటోలు తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ ఫొటోలు చూసిన నెటిజెన్లు ఒక్కింత ఆశ్చర్యానికి గురికావడంతో పాటు షాక్‌కు కూడా గురయ్యారు. ఇక అమెరికాలో స్థిరపడ్డ తమవారు ఎలా ఉన్నారో అని భారత్‌లోని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు గృహాల్లోని సీలింగ్ ఫ్యాన్లు సైతం మంచు ప్రభావంతో గడ్డకట్టుకుపోయాయి.

Also Read: తమిళనాడులో ఎన్నికల కోలాహలం : స్టాలిన్‌ సీట్ల సర్దుబాటు

ఇక వాష్‌రూంలలోనూ కమోడ్స్ గడ్డకట్టుకుపోయిన ఫొటోలను టెక్సాస్ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టెక్సాస్‌లో విపరీతమైన మంచు కురుస్తుండగా.. ప్రస్తుతం అది ఈశాన్యం వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రాంతంలో దాదాపు 100 మిలియన్ జనాభా నివసిస్తోందని అధికారులు తెలిపారు. ఇక ఈ వారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కొందరు ఇళ్లలోనే ఉంటూ మృతి చెందినట్లు చెప్పారు. హూస్టన్ ప్రాంతంలో గ్యారేజీలో ఉంచిన కారు నుంచి కార్బన్ మొనాక్సైడ్ విడుదల కావడంతో ఇంట్లోనే ఓ కుటుంబం మృతి చెందిన విషయం కలకలం సృష్టించింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు