https://oktelugu.com/

ప్రియమిత్రుడు కోసం కదిలివచ్చిన మెగాస్టార్ చిరు

తమ వెంట నడిచే వారికోసం కదిలివచ్చే వారు కొందరే ఉంటారు. అందుకు గొప్ప మనసు కావాలి. ‘పునాదిరాళ్లు’తో సినిమా ఇండస్ట్రీలో పురుడు పోసుకున్న మెగాస్టార్ ఇప్పుడు టాలీవుడ్ మెగా స్టార్ గా ఎదిగినా తన మూలాలు మరిచిపోలేదు. తన కోసం నడిచిన పాత మిత్రుడు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి అన్నీ వదిలేసి వచ్చాడు. అంతటి ‘మెగా ఔదార్యం’ చూసి ఆ మిత్రుడు, జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడి కళ్ల వెంట ఆనందభాష్ఫాలు జలజలా రాలాయి. మెగా స్టార్ మంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2020 / 06:59 PM IST
    Follow us on

    తమ వెంట నడిచే వారికోసం కదిలివచ్చే వారు కొందరే ఉంటారు. అందుకు గొప్ప మనసు కావాలి. ‘పునాదిరాళ్లు’తో సినిమా ఇండస్ట్రీలో పురుడు పోసుకున్న మెగాస్టార్ ఇప్పుడు టాలీవుడ్ మెగా స్టార్ గా ఎదిగినా తన మూలాలు మరిచిపోలేదు. తన కోసం నడిచిన పాత మిత్రుడు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసి అన్నీ వదిలేసి వచ్చాడు. అంతటి ‘మెగా ఔదార్యం’ చూసి ఆ మిత్రుడు, జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడి కళ్ల వెంట ఆనందభాష్ఫాలు జలజలా రాలాయి. మెగా స్టార్ మంచి మనసు ఆయనను కదిలించింది. కదిలివచ్చిన మెగా స్టార్ ఔదార్యానికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాగా ఉన్నప్పుడు అందరూ చూస్తారు.. కానీ బాగా లేనప్పుడు ఆదుకున్న వారే అసలైన మంచి మనషులు. ఆ మంచి మనుసును మెగా స్టార్ కు ఉందని అందరూ ప్రశంసలు మెచ్చుకుంటున్నారు..

    Also Read: డ్రగ్స్ కేసులో హీరోయిన్ కి బెయిల్ !

    ఆప‌ద‌లో ఆదుకునేందుకు.. ఆప‌న్న‌హ‌స్తం అందించేందుకు నేనున్నాన‌ని మెగాస్టార్ చిరంజీవి ముందుకు వ‌స్తారు. అలా ఎంద‌రినో ఆదుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత మూడు నెలలుగా చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడికి వెంటనే ఆస్ప‌త్రి చికిత్స అందించ‌డ‌మే గాక ఆదివారం రోజు ఆయ‌న‌ను స్వయంగా వచ్చి పరామర్శించడం విశేషం.

    ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారు. అంతే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాల ఆదుకుంటామని చిరంజీవి హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స‌ను అందించే ఏర్పాటు చేశారు.

    రామ్మోహన్ నాయుడుని పరామర్శించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉంది’’ అని ప్రశంసించారు. ఇలా నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని అన్నారు. ఆయ‌న త్వర‌గా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.

    Also Read: ప్రభాస్ ను వివాదాల్లోకి నెట్టిన సైఫ్ అలీ ఖాన్ !

    జ‌ర్న‌లిస్ట్ రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌జారాజ్యం పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుకైన పాత్ర‌ను పోషించారు. చిరంజీవి వెంట నడిచారు. ఆయనతోపాటు పార్టీలో.. బయట కూడా పోరాడారు. అందుకే చిరంజీవి ఎంతో బిజీగా ఉన్న సమయంలోనూ మిత్రుడు బాగా లేడని తెలిసిన వెంటనే కదిలివచ్చాడు. ఓవైపు ఆచార్య షూటింగ్… మ‌రోవైపు నిహారిక వివాహ‌మ‌హోత్స‌వం సంద‌ర్భంగా బిజీ షెడ్యూల్ లోనూ చిరు ఇలా ప‌రామ‌ర్శ‌కు రావడం విశేషం..

    *జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు నేపథ్యం

    రామ్మోహన్ నాయుడు స్వస్థలం గుంటూరు నగరం. కరీంనగర్ లో వీళ్ల నాన్న గారు ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నారు. కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ గా చేశారు.  అనంతరం జర్నలిజంలోకి ప్రవేశించారు. ఈయన మంచి క్రికెట్ ప్లేయర్ కూడా. ప్రముఖ క్రికెటర్ సీకే నాయుడిపై బుక్ రాశారు. దూరదర్శన్ లో ‘అపరంజిత’, ‘సిరి’ సీరియల్స్ ప్రొడ్యూస్ నంది అవార్డులు అందుకున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సీనియర్ పాత్రికేయుడిగా పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలో మీడియా సలహాదారు కొనసాగారు. చిరంజీవితో అనునిత్యం ఉంటూ పార్టీ కార్యక్రమాలు, స్ట్రాటజీ, మీడియా వ్యవహారాలను మొత్తం పర్యవేక్షించారు. చిరంజీవికి విలువైన సలహాలు సూచనలు ఇచ్చి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మోహన్ కోసం చిరంజీవి స్వయంగా వచ్చి పరామర్శించారు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.