భారత్, ఇండియా మధ్య గత ఏడాది సరిహద్దుల్లోని గాల్వాన్ లో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో మన భారత సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నాడు తమ సైనికులు ఎంత మంది చనిపోయారన్నది చైనా బయటపెట్టలేదు. దాదాపు 35 మంది చనిపోయారని అమెరికా, కాదు 45 మంది అని తాజాగా రష్యా బయటపెట్టింది.
Also Read: జగన్ వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా..?
దీంతో ఇబ్బందుల్లో పడ్డ జిత్తుల మారి చైనా తాజాగా గాల్వాన్ ఘర్షణకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. ప్రభుత్వ అధికారిక మీడియా ద్వారా దీన్ని ప్రపంచం ముందు ఉంచింది.
భారత్ తో ఘర్షణలో తమ సైనికులు వీరోచితంగా పోరాడి అమరులు అయ్యారని గొప్పగా చెప్పుకుంది. ఏడాదిగా సైలెంట్ గా ఉన్న చైనా తాజాగా కేవలం నలుగురు మాత్రమే తమ సైనికులు చనిపోయారని వీడియో రిలీజ్ చేసి చెప్పుకొచ్చింది.కానీ ఇదంతా అబద్ధమని అన్ని దేశాల వారు ఆడిపోసుకుంటున్నారు.
Also Read: పంచాయతీ పోరులో రాజకీయ దుమారం
తాజాగా చైనా రిలీజ్ చేసిన వీడియోలో భారత సైనికులే చైనా సైనికులపైకి వచ్చినట్టు చైనా కుట్రపూరితంగా చూపించింది. భారత సైనికుల కంటే ఎన్నోరెట్లు చైనా సైన్యం వీడియోలో కనిపించింది. వారు సరిహద్దుల్లో చొచ్చుకొచ్చి కావాలనే ఘర్షణకు దిగినట్లు స్పష్టంగా ఉంది. తప్పును కూడా గొప్పగా చెప్పుకొని చైనా ఇప్పుడు వీడియో రిలీజ్ చేసింది.
భారత్-చైనా సరిహద్దులో గత ఏడాది జూన్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. గాల్వాన్లో ఒకరిపై రాళ్లు రువ్వుకోవడం.. రాడ్లతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో భారత్ కు చెందిన ఒక కర్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబుతో పాటు 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. చైనాకు చెందిన 43మంది సైనికులు మృతిచెందినట్లు ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడు కేవలం నలుగురే చనిపోయారని చైనా సైన్యం అధికారికంగా ప్రకటించింది.
An on-site video reveals in detail the four #PLA martyrs and other brave Chinese soldiers at the scene of the Galwan Valley border clash with India in June 2020. https://t.co/hSjP3hBnqr pic.twitter.com/g6zNpT1IrX
— Global Times (@globaltimesnews) February 19, 2021