‘రక్షణ’ బడ్జెట్ పెంచుతున్న చైనా.. అమెరికాకు సరితూగుతుందా?

ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఉంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ దేశ బడ్జెట్ ఎక్కువ. రక్షణ రంగ కేటాయింపులూ ఎక్కువే. అయితే అమెరికాను అన్ని రంగాల్లో ఢీకొంటున్న చైనా రక్షణ రంగ బడ్జెట్ ను సైతం పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరోసారి పెంచింది. అయితే అది అమెరికాకు అందనంత తక్కువగా ఉంది. కానీ 2027 నాటికి అమెరికాతో సమానంగా రక్షణ రంగ బడ్జెట్ ను అందుకోవాలని యోచిస్తోంది. తాజాగా చైనా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ […]

Written By: NARESH, Updated On : March 5, 2021 5:52 pm
Follow us on

ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఉంది. అన్ని రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆ దేశ బడ్జెట్ ఎక్కువ. రక్షణ రంగ కేటాయింపులూ ఎక్కువే. అయితే అమెరికాను అన్ని రంగాల్లో ఢీకొంటున్న చైనా రక్షణ రంగ బడ్జెట్ ను సైతం పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరోసారి పెంచింది. అయితే అది అమెరికాకు అందనంత తక్కువగా ఉంది. కానీ 2027 నాటికి అమెరికాతో సమానంగా రక్షణ రంగ బడ్జెట్ ను అందుకోవాలని యోచిస్తోంది.

తాజాగా చైనా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెకియాంగ్ రక్షణ బడ్జెట్ ను ప్రకటించారు. ప్రస్తుతం ఏడాదికి గాను రక్షణ రంగానికి చైనా దాదాపు 1.35 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. అంటే దాదాపు 209 బిలియన్ డాలర్లు అన్నట్టు. వరుసగా ఆరో ఏడాది డిఫెన్స్ బడ్జెట్ లో వృద్ధి కొనసాగించారు. గత ఏడాది ఈ బడ్జెట్ 1.268 ట్రిలియన్ యువాన్లు (దాదాపు 196.44 బిలియన్ డాలర్లు)గా ఉంది.

అయితే అమెరికా బడ్జెట్ కు చైనా బడ్జెట్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చైనా కేటాయింపులతో పోలిస్తే చైనా బడ్జెట్ పావు వంతు మాత్రమే కావడం గమనార్హం. అమెరికా రక్షణ రంగ బడ్జెట్ 740.5 బిలియన్ డాలర్లు. చైనాది 196.44 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు 5 రెట్లు బడ్జెట్ ఇదీ..

ఇక భారత రక్షణ బడ్జెట్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఈ రంగానికి భారత్ దాదాపు 65.7 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.