ట్రైలర్ టాక్: భర్త చనిపోయిన మహిళతో ‘చావు’ ప్రేమ

అసలే భర్త లేని మహిళ.. ఓ శవాలను తరలించే వ్యక్తి.. ఇద్దరికీ ఆసుపత్రిలోనే చూపులు కలిశాయి. ఆ వింతతువు ప్రేమ సాధించేందుకు ఆ వ్యక్తి పడిన కష్టాలే ‘చావుకబురు చల్లగా’ మూవీ.. కార్తికేయ హీరోగా.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మించిన విలక్షణ చిత్రం ‘చావుకబురు చల్లగా’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. […]

Written By: NARESH, Updated On : March 5, 2021 7:46 pm
Follow us on

అసలే భర్త లేని మహిళ.. ఓ శవాలను తరలించే వ్యక్తి.. ఇద్దరికీ ఆసుపత్రిలోనే చూపులు కలిశాయి. ఆ వింతతువు ప్రేమ సాధించేందుకు ఆ వ్యక్తి పడిన కష్టాలే ‘చావుకబురు చల్లగా’ మూవీ.. కార్తికేయ హీరోగా.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మించిన విలక్షణ చిత్రం ‘చావుకబురు చల్లగా’ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఇందులో అనసూయ చేసిన ఐటెం సాంగ్ తో సినిమా జనాల్లో నానగా.. తాజాగా ట్రైలర్ అంచనాలు పెంచేలాగానే ఉంది.

నిత్యం చావు ఇళ్లకు వెళ్లి శవాలను తరలించే వ్యక్తి ప్రేమను భర్త పోయి దుఖంలో ఉన్న హీరోయిన్ లావణ్య దగ్గర వెతుక్కోవడం.. ఆ ప్రేమను సాధించేందుకు పడే కష్టాలే ఈ సినిమా కథ.

కార్తికేయ ఈ సినిమాలో ఉత్సాహంగా జోవియల్, కరుడుగట్టిన యువకుడిగా కనిపించాడు. ట్రైలర్ లో కాస్త వింత కథే ఉన్నా చూపించాలనే కట్ చేశారు. చావుకబురు చల్లగా అంటూ భిన్నమైన సినిమానే చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ట్రైలర్ ను కింద చూడొచ్చు.