https://oktelugu.com/

చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావ్.. చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని నిప్పులు

ఏపీ మంత్రి కొడాలి నాని బండ బూతులు తిట్టాడు. అస్సలు వినడానికే దారుణమైన పదాలు వాడాడు. తాను పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నానని.. తాజాగా విజయవాడ మున్సిపల్ ప్రచారంలో ఆరోపించిన చంద్రబాబు నిజస్వరూపం ఇదీ ఆయన దందాను బయటపెట్టారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోవడానికి కారణం ఉందని.. ఆయనను 1983లో చిత్తుగా ఓడించారని.. అక్కడ వ్యభిచార గృహాలు నడిపిన సన్నాసి చంద్రబాబు అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2021 / 01:52 PM IST
    Follow us on

    ఏపీ మంత్రి కొడాలి నాని బండ బూతులు తిట్టాడు. అస్సలు వినడానికే దారుణమైన పదాలు వాడాడు. తాను పేకాట క్లబ్ లు నిర్వహిస్తున్నానని.. తాజాగా విజయవాడ మున్సిపల్ ప్రచారంలో ఆరోపించిన చంద్రబాబు నిజస్వరూపం ఇదీ ఆయన దందాను బయటపెట్టారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

    చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోవడానికి కారణం ఉందని.. ఆయనను 1983లో చిత్తుగా ఓడించారని.. అక్కడ వ్యభిచార గృహాలు నడిపిన సన్నాసి చంద్రబాబు అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ “చంద్రబాబు! ప్రజలు గెలిపించిన జగన్ ను వాడు వీడు అంటావా? ఆయన వదిలేసినా.. నేను నిన్ను విడిచిపెట్టే వ్యక్తిని కాను. 1980 ప్రాంతంలో చంద్రగిరిలో నువ్వు నిర్వహించిన వ్యభిచార గృహాల గురించి అందరికీ తెలసు. నేను అవన్నీ బయటకు తీసి మిమ్మల్ని నడిరోడ్డుపై నగ్నంగా నిలబెడుతాను. మిమ్మల్ని మున్సిపల్ వ్యాన్‌లో కూర్చుని పిచ్చి కుక్కలతో కరిపిస్తాను ” అంటూ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

    చంద్రబాబు ఎందుకు బతుకుతున్నాడో తెలియని దరిద్రపు జన్మ నీది మంత్రి కొడాలి నాని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఆరోపణలను ప్రస్తావిస్తూ నాని కడిగేశారు. “ఓటర్లు మిమ్మల్ని.. మీ పార్టీని పంచాయతీ ఎన్నికల్లో దూరం పెట్టారు. ప్రభుత్వం లేదా ఎన్నికల సంఘం ఈ విషయంలో ఏం చేయగలవు? ” అంటూ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.

    ఇక తనను గుడివాడలో ఓడించడానికి రెండు సార్లు ప్రయత్నించిన చంద్రబాబుకు మరోసారి మంత్రి కొడాలి నాని సవాల్ చేశాడు. “మీరు నిజంగా 40 ఇయర్స్ పాలిటిక్స్ అయితే.. దమ్ముంటే గుడివాడకు వచ్చి నాకు వ్యతిరేకంగా పోటీ చేయండి. ఈ స్థలం మీ పిల్లనిచ్చిన మామకు బాగా దగ్గర. ఎవరు గెలుస్తారో చూద్దాం ” అని కొడాలి నాని తొడగొట్టాడు.