https://oktelugu.com/

అరె.. ‘దిల్ రాజు’కి పోటీగా ఒకడొచ్చాడు !

‘తాడిని తన్నే వాడుంటే.. వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు’ అనే సామెత ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాతకి బాగా సరిపోయేలా ఉంది. ఆ నిర్మాతే దిల్ రాజు. అనాముకుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. పెద్ద సినిమాల దగ్గర నుండి చిన్నాచితకా సినిమాల వరకూ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి లాంటి లెక్కల్లో ఆరితేరిపోయిన ఈ బడా నిర్మాత తలను తన్నడానికే ఒకడు వచ్చాడట. Also Read: […]

Written By:
  • admin
  • , Updated On : March 8, 2021 / 01:51 PM IST
    Follow us on


    ‘తాడిని తన్నే వాడుంటే.. వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు’ అనే సామెత ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాతకి బాగా సరిపోయేలా ఉంది. ఆ నిర్మాతే దిల్ రాజు. అనాముకుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. పెద్ద సినిమాల దగ్గర నుండి చిన్నాచితకా సినిమాల వరకూ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి లాంటి లెక్కల్లో ఆరితేరిపోయిన ఈ బడా నిర్మాత తలను తన్నడానికే ఒకడు వచ్చాడట.

    Also Read: క్రిష్ ఒక్క‌డికి సాధ్యం కా‌వ‌ట్లేద‌ట‌.. ప‌వ‌న్ సినిమాకు మ‌రో డైరెక్ట‌ర్‌?!

    “క్రాక్” హిట్ కావడంతో నైజాంలో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుకి డిమాండ్ పెరిగింది. దాంతో వరంగల్ శ్రీను కూడా రోజురోజుకూ దూకుడు పెంచుకుంటూ పోతున్నాడు. అతని వెనుక కొందరు “పెద్దలు” హస్తం ఉంది అనేది పుకారు. ఎవరు ఉన్నా.. అతని టార్గెట్ మాత్రం దిల్ రాజునే. రాజు పై అక్కసు ఉన్నట్లు ఉంది శ్రీనుకి. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న శ్రీను ఇండస్ట్రీలోని దిల్ రాజు వ్యతిరేఖ శక్తులను పోగేస్తున్నాడట.

    పెద్ద హీరోల సినిమాలను దిల్ రాజుకు అందకుండా సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ‘పుష్ప’, ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ సినిమాలను వరంగల్ శీను కొనేశాడు. దిల్ రాజుని నిలువరించాలని ఇప్పటికే ఆతని మాజీ పార్ట్నర్ లక్ష్మణ్ కూడా రంగంలోకి దిగి వరుసగా సినిమాలు కొంటున్నాడు. కానీ వరంగల్ శీను నుంచి పోటీ మాత్రం దిల్ రాజు గట్టి పోటీ ఉండేలా ఉంది.

    Also Read: ఫుల్ గ్లామరస్ రోల్ లో ‘కీర్తి సురేష్’ !

    ఇప్పుడు చాలామంది చిన్న నిర్మాతలు వరంగల్ శీను భుజం మీదినుంచి దిల్ రాజు పై బాణం ఎక్కుపెట్టడానికి రెడీ అవుతున్నారట. ముఖ్యంగా దిల్ రాజు సినిమాలను ఆడనీయకుండా కుట్రలు చేస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్