
ప్రతిపక్షం టీడీపీకి ఏపీ అసెంబ్లీలో చుక్కలు కనిపిస్తున్నాయి. అరే తమ వాదన వినిపిస్తామంటే చంద్రబాబుకే మైక్ దొరకని పరిస్థితి. ఆయన మైక్ కోసం తొలిరోజు ఏకంగా స్పీకర్ చాంబర్ ఎదుట బైటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రెండోరోజు అదే పరిస్థితి. ముచ్చటగా మూడోరోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేయడం విశేషం. దీంతో చంద్రబాబు కూడా వాకౌట్ చేసి వెళ్లిపోయాడు. దీంతో అసెంబ్లీలో వాయిస్ వినిపిద్దామన్న చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ అవకాశం లేకుండా చేస్తోంది వైసీపీ..
Also Read: వీడియో: అసెంబ్లీలో చంద్రబాబు గాలి తీసిన జగన్
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకొచ్చారు. పలు మార్లు మందలించిన స్పీకర్ చివరకు 9మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన వారితోపాటు చంద్రబాబు, మిగతా ఎమ్మెల్యేలు కూడా వాక్ ఔట్ చేసి బయటకు వెళ్లిపోయారు.సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, రవికుమార్, బాల వీరాంజనేయస్వామి, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు ఉన్నారు.
Also Read: మళ్లీ ఫాంలోకి వైసీపీ సోషల్ మీడియా సైన్యం
అనంతరం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని.. పోలవరం రాష్ట్రానికి ఒక వరమన్నారు. గత సీఎంలు పోలవరాన్ని పూర్తి చేయాలనుకోలేదని.. చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడని ఆరోపించారు. అందుకే అసెంబ్లీలో చర్చ రాకుండా జగన్ అడ్డుపడుతున్నాడని పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీ రగులుతూనే ఉంది. వరుసగా మూడోరోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం షాకిచ్చారు. బుధవారం 9మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వారితోపాటు చంద్రబాబు మిగతా నేతలు కూడా వాకౌట్ చేయడంతో ఇక ప్రతిపక్ష గొంతే అసెంబ్లీలో వినిపించని పరిస్థితి నెలకొంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్