https://oktelugu.com/

నేనింతే.. నా నిర్ణయమే ఫైనలంటున్న బాబు

ఎంత గొప్ప లీడర్‌‌ అయినా.. ఓ నిర్ణయం తీసుకునే ముందు అన్ని విధాల ఆలోచించాల్సి ఉంటుంది. అది సీనియర్‌‌ మోస్ట్‌ లీడర్‌‌ అయినా సరే.. మొన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు స్థాపించినా సరే. వారు తీసుకునే నిర్ణయాలపైనే క్యాడర్‌‌ ఆధారపడి ఉంటుంది. అందులోనూ సమష్టి నిర్ణయాలు మంచి ఫలితాలిస్తుంటాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలోనూ పార్టీ నేతలతో చర్చించి ఇస్తే దాని ఊపు కూడా వేరేలా ఉంటుంది. కానీ.. సొంత నిర్ణయాలు తీసుకొని, తమ వారికే టికెట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 21, 2020 11:13 am
    Follow us on

    Did Chandrababu lose hope in that area ...?

    ఎంత గొప్ప లీడర్‌‌ అయినా.. ఓ నిర్ణయం తీసుకునే ముందు అన్ని విధాల ఆలోచించాల్సి ఉంటుంది. అది సీనియర్‌‌ మోస్ట్‌ లీడర్‌‌ అయినా సరే.. మొన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి పార్టీలు స్థాపించినా సరే. వారు తీసుకునే నిర్ణయాలపైనే క్యాడర్‌‌ ఆధారపడి ఉంటుంది. అందులోనూ సమష్టి నిర్ణయాలు మంచి ఫలితాలిస్తుంటాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలోనూ పార్టీ నేతలతో చర్చించి ఇస్తే దాని ఊపు కూడా వేరేలా ఉంటుంది. కానీ.. సొంత నిర్ణయాలు తీసుకొని, తమ వారికే టికెట్లు ఇస్తే ఆ ఫలితాలు మరొలా ఉంటాయి.

    Also Read: ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ. 4,000 జమ..!

    సరిగా.. పోయిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి వైఖరినే వ్యవహరించారు. సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కాస్త బెడిసికొట్టాయి. ఎన్నికలకు ముందు కూడా ‘మీరు ఎవ‌రికి టికెట్ ఇవ్వాల‌నుకున్నారో.. ముందు చెప్పండి. వారి ప‌రిస్థితి మేం చెబుతాం. మీ సొంతానికి నిర్ణయం తీసుకుని.. గెలిపించాలంటూ.. మా నెత్తిన రుద్దొద్దు’ అని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ నాయ‌కులు బాబుకు విన్నవించారు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో చేరిన 23 మంది విష‌యంలో స‌గానికి పైగా నేత‌ల విష‌యంలో ఇదే డిమాండ్ వినిపించింది.

    అయిన‌ప్పటికీ.. చంద్రబాబు ఎవ‌రినీ లెక్కచేయ‌లేదు. కొద్ది మంది నేత‌ల‌నే సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నారు. దీని ఫ‌లితం ఎలా వ‌చ్చిందో అందరికీ తెలిసిందే. మ‌రి గ‌తం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామ‌ని, మున్ముందు పార్టీలో అంద‌రికీ ప్రాధాన్యం ఉంటుంద‌ని, తీసుకునే నిర్ణయాలు, చేసే ప‌నుల్లో ప్రతి ఒక్కరికీ భాగ‌స్వామ్యం క‌ల్పిస్తామ‌ని చంద్రబాబు ప‌దేప‌దే చెబుతున్నారు. తీరా అమలుకు వచ్చే సరికి పాత వైఖరినే అనుసరిస్తున్నారు. తాజాగా ఇప్పుడు కూడా ఇలానే వ్యవ‌హ‌రించ‌డంపై త‌మ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు.

    అధికార పక్షమైన వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంట‌రీ జిల్లాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో పార్లమెంటు జిల్లాకు ఒక ఇన్‌చార్జిని నియ‌మించారు. దీనికితోడు పార్లమెంట‌రీ మ‌హిళా క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేసి.. మ‌హిళ‌ల‌కు ప‌గ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయాన్ని ఎవ‌రూ కాద‌న‌లేదు. ఎందుకంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీ పుంజుకోవాల‌నే అందరూ కోరుకుంటున్నారు. వైసీపీ స్టయిల్లోనే ప‌ద‌వుల వికేంద్రీక‌ర‌ణ కూడా మంచిదే. అయితే.. ఈ నియామ‌కాల్లోనూ చంద్రబాబు ఎవ‌రినీ సంప్రదించ‌డం లేదనే తమ్ముళ్లలో అసంతృప్తి. మ‌రీ ముఖ్యంగా పార్లమెంట‌రీ జిల్లా మ‌హిళా క‌మిటీల నియామ‌కాల్లో అప్పటికే జిల్లా మ‌హిళా అధ్యక్షులుగా ఉన్న నాయ‌కుల‌తో చంద్రబాబు సంప్రదించి ఉంటే బాగుండేద‌ని.. వారు కూడా సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చేవార‌ని అంటున్నారు. కానీ, కొద్ది మంది అంత‌ర్గత నేత‌ల‌తో జిల్లాల‌కు సంబంధం లేనివారితో చంద్రబాబు చ‌ర్చించి నిర్ణయాలు తీసుకోవ‌డం వ‌ల్ల.. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని ఇప్పటి వ‌ర‌కు బాధ్యులుగా ఉన్నవారు.. ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఒక పూట మాత్రమే బడి!

    టీడీపీ బలోపేతం చేయాలనుకున్న చంద్రబాబు నిర్ణయం సరైనదే అయినప్పటికీ.. ఇప్పటికే ఆయా పదవుల్లో కొనసాగిన వారిని సంప్రదించకపోవడంపై నిరసన వ్యక్తం అవుతోంది. పార్లమెంట‌రీ జిల్లా మ‌హిళా అధ్యక్షులు, ప్రధాన కార్యద‌ర్శుల నియామ‌కాల్లో పాత జిల్లాల మ‌హిళా అధ్యక్షుల‌ను సంప్రదించ‌కుండానే.. కనీసం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల‌కు చెప్పకుండానే చాలా చోట్ల నియామ‌కాలు జ‌రిగిపోయాయి. ఎన్నికల్లో అంత భారీ స్థాయిలో ఓటమిని చవి చూసినా బాబు వైఖరిలో మాత్రం మార్పు రావడంలేదని పార్టీలోనే బలంగా వినిపిస్తోంది.