ట్రైలర్ టాక్: యుద్ధం మొదలెట్టిన నితిన్ ‘చెక్’ పెట్టేదెవరికి?

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ‘చంద్రశేఖర్ యేలేటి’. ఆయన చిత్రాలన్నీ ఒక కొత్త అంశంపై పరిశోధన చేసినట్టు.. ఒక కొత్త అంశాన్ని కనుగొన్నట్టు అద్భుంగా ఉంటాయి. గత చిత్రాలన్నీ కూడా కొత్తదనం ఉన్నా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయినా ఆయన ప్రయోగాలు మాత్రం మారకుండా కొత్త దనం కోసం ట్రై చేస్తూనే ఉంటాడు. Also Read: ఉప్పొంగిన అభిమాన సంద్రంలో తడిసిన స్టైలిష్ స్టార్ ఈ క్రమంలోనే యువహీరో నితిన్ తో చంద్రశేఖర్ యేలేటి […]

Written By: NARESH, Updated On : February 4, 2021 10:13 am
Follow us on

ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు ‘చంద్రశేఖర్ యేలేటి’. ఆయన చిత్రాలన్నీ ఒక కొత్త అంశంపై పరిశోధన చేసినట్టు.. ఒక కొత్త అంశాన్ని కనుగొన్నట్టు అద్భుంగా ఉంటాయి. గత చిత్రాలన్నీ కూడా కొత్తదనం ఉన్నా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయాయి. అయినా ఆయన ప్రయోగాలు మాత్రం మారకుండా కొత్త దనం కోసం ట్రై చేస్తూనే ఉంటాడు.

Also Read: ఉప్పొంగిన అభిమాన సంద్రంలో తడిసిన స్టైలిష్ స్టార్

ఈ క్రమంలోనే యువహీరో నితిన్ తో చంద్రశేఖర్ యేలేటి తీసిన చిత్రం ‘చెక్’. చందరంగం ఆట నేపథ్యంలో ఓ టెర్రరిస్ట్ అయిన నితిన్ ఎలా ఉరిశిక్ష నుంచి బతికి బయటపడ్డాడన్నది అసలు కథ.

భీష్మ సినిమాతో యంగ్ లవర్ బాయ్ గా వినోదం పంచిన నితిన్ కరోనా తర్వాత మళ్లీ అభిమానులకు అలరించేందుకు సిద్ధమయ్యాడు. ప్రియా ప్రకాష్ , రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. పోసాని, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

Also Read: రవితేజ ఈ సారి గ్లామర్ ను నమ్ముకున్నాడు !

ఈ చిత్రాన్ని ఫిబ్రివరి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని రెట్టింపు చేసింది.

జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా కనిపిస్తోంది. ఉరిశిక్ష పడిన ఒక తీవ్రవాదిగా నితిన్ ఇందులో నటించారు. తన ముందు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని జైలు గోడల మధ్యన ఉంటూనే చదరంగం ఆటతో తన లక్ష్యాన్ని ఎలా చేరాడు? ఉరిశిక్షను ఎలా తప్పించుకున్నాడన్నది చాలా ఆసక్తికరంగా మలిచారు. ఈ సినిమాకు కథ ఆధ్యంతం ఉత్కంఠగా తీర్చిదిద్దారు. వి. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత.. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్