
కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నుంచి ఇప్పుడు అన్ లాక్ దశలు నడుస్తున్నాయి. సెప్టెంబర్ 30తో అన్ లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని మినహాయింపులతో అక్టోబర్ 1 నుంచి మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కంటైన్ మెంట్ జోన్ల వెలుపల ఈనెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సుల తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే 50శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించింది. అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయించే వెసులుబాటు ఆయా రాష్ట్రాలకు కట్టబెట్టింది.
ఇక ఆగస్టు 15 నుంచి కోవిడ్ నిబంధనలతో ఎగ్జి బిషన్లు, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. స్విమ్మింగ్ ఫూల్స్ తెరిచే వెసులుబాటు కల్పించింది. కంటైన్ మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
- కేంద్రప్రభుత్వం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.
1. సినిమా హాళ్లకు 50% సీట్ల సామర్ధ్యంతో అనుమతినిచ్చారు.
2. రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో పాఠశాలల పునః ప్రారంభానికి వెసులుబాటు కల్పించింది.
3. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్ పూల్ లకు అనుమతినిచ్చారు.
4. కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31వరకు లాక్ డౌన్ ను పొడిగించారు.