https://oktelugu.com/

నేడు రైతులతో కేంద్రం చర్చలు.. కొలిక్కి వచ్చేనా?

కేంద్రం వ్యవసాయ సంస్కరణల పేరిట కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఉత్తరాది  రైతులు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 34రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు. వణికించే చలిలోనూ రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్రంపై హక్కుల కోసం పోరాటం చేస్తుండటంతో వీరికి అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. అయితే చలికి తట్టుకోలేక ఇప్పటికే 40కిపైగా అన్నదాతలు మృతిచెందాటం శోచనీయంగా మారింది.మరోవైపు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం రైతులతో పలుమార్లు చర్చలు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 10:18 AM IST
    Follow us on

    కేంద్రం వ్యవసాయ సంస్కరణల పేరిట కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఉత్తరాది  రైతులు డిమాండ్ చేస్తున్నారు. గడిచిన 34రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపడుతున్నారు.

    వణికించే చలిలోనూ రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేంద్రంపై హక్కుల కోసం పోరాటం చేస్తుండటంతో వీరికి అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుంది.

    అయితే చలికి తట్టుకోలేక ఇప్పటికే 40కిపైగా అన్నదాతలు మృతిచెందాటం శోచనీయంగా మారింది.మరోవైపు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

    కేంద్రం రైతులతో పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం మాత్రం రావడం లేదు. కొత్త చట్టం అమలు వల్ల తమకు కనీస మద్దతు ధర కూడా పోతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు.

    కేంద్రం చేసిన కొత్త చట్టంలో కనీస మద్దతు ధరను చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం రైతులకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువగానే వస్తుందని చెబుతోంది.

    ఈ విషయంలో రైతులకు.. కేంద్రానికి మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో రైతులకు మరోసారి చర్చలు జరిపిందుకు కేంద్రం 40 రైతు సంఘాలకు ఆహ్వానం పలికింది.

    ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రం నేటి మధ్యాహ్నం 2గంటలకు 40రైతు సంఘాలతో చర్చలు జరుపనుంది. ఈ చర్చల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పాల్గొనన్నారు.

    రైతులతో కేంద్రం చర్చలు ఈసారైనా ఫలితం వస్తాయా? లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ సమస్యకు త్వరగా ముగింపు పలుకాలని ప్రతీఒక్కరు కోరుకుంటున్నారు.