https://oktelugu.com/

టీఆర్ఎస్ తో ‘పొత్తు’పై బండి సంచలన కామెంట్స్..!

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండగా బీజేపీ మాత్రం క్రమంగా బలపడుతోంది. Also Read: సీఎం జగన్ ను నరరూప రాక్షసుడు అనాలా..? రామతీర్థలో ఊగిపోయిన చంద్రబాబు ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చిన బీజేపీ అదే పంథాను కొనసాగించాలని భావిస్తోంది. ఈక్రమంలోనే కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ బండి సంజయ్ కొద్దిరోజులుగా ఫైర్ అవుతున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 2, 2021 / 08:00 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తుండగా బీజేపీ మాత్రం క్రమంగా బలపడుతోంది.

    Also Read: సీఎం జగన్ ను నరరూప రాక్షసుడు అనాలా..? రామతీర్థలో ఊగిపోయిన చంద్రబాబు

    ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చిన బీజేపీ అదే పంథాను కొనసాగించాలని భావిస్తోంది. ఈక్రమంలోనే కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ బండి సంజయ్ కొద్దిరోజులుగా ఫైర్ అవుతున్నారు.

    తాజాగా మరోసారి టీఆర్ఎస్ సర్కార్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ హయాంలో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు ఉంటేనే కేసీఆర్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు గుర్తుకొస్తారంటూ మండిపడ్డారు.

    స్థానిక సంస్థల అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కార్ నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదిక.. శ్మశాన వాటికలు.. ట్రాక్టర్ల కొనుగోలుకు కేంద్రమే నిధులిస్తుందని బండి సంజయ్ తెలిపారు.

    Also Read: కాంగ్రెస్ నేతల పర్యటన ఉద్రిక్తం.. మంత్రిపై ఉత్తమ్ ఫైర్..!

    కేసీఆర్ కు అరెస్టు భయం పట్టుకుందని.. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ తనను జైలుకు పంపొద్దని కేంద్రం వద్ద పొర్లుదండాలు పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్ని దండాలు పెట్టినా వదిలేది లేదని స్పష్టం చేశాడు.

    టీఆర్ఎస్.. బీజేపీ మ్యాచ్ ఫిక్సయిందనే ఆరోపణలు వస్తుండటంపై కూడా బండి సంజయ్ స్పందించారు. బుద్ధి.. సిగ్గు ఉన్నోడెవరు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోరంటూ ఘాటుగా స్పందించాడు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్