https://oktelugu.com/

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు షాక్.. కేంద్రం కొత్త ఈకామర్స్ వెబ్ సైట్…!

దేశంలో ఆన్ లైన్ షాపింగ్ చేసేవాళ్లు ఎక్కువగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా షాపింగ్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ రెండు ఈకామర్స్ వెబ్ సైట్లు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తాయి కాబట్టి వస్తువుల నాణ్యతలో లోపం ఉన్నా సులభంగా రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ఈ రెండు వెబ్ సైట్ల ద్వారానే షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కేంద్రం ఈ రెండు సంస్థలకు భారీ ఝలక్ ఇచ్చింది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2021 / 08:04 PM IST
    Follow us on


    దేశంలో ఆన్ లైన్ షాపింగ్ చేసేవాళ్లు ఎక్కువగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా షాపింగ్ చేస్తారనే సంగతి తెలిసిందే. ఈ రెండు ఈకామర్స్ వెబ్ సైట్లు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకే అందిస్తాయి కాబట్టి వస్తువుల నాణ్యతలో లోపం ఉన్నా సులభంగా రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ఈ రెండు వెబ్ సైట్ల ద్వారానే షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కేంద్రం ఈ రెండు సంస్థలకు భారీ ఝలక్ ఇచ్చింది.

    Also Read: గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. ఆ ఛార్జీలు లేనట్లే..?

    దేశీ ఈకామర్స్ వెబ్ సైట్ ను కేంద్రం దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ekhadiindia.com పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఈకామర్స్ వెబ్ సైట్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆవిష్కరించిన ఈ వెబ్ సైట్ ద్వారా కేవలం మన దేశానికి చెందిన ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

    Also Read: గోల్డ్ లోన్ తీసుకునే వారికి అలర్ట్.. చేయకూడని తప్పులివే..?

    ekhadiindia.com వెబ్ సైట్ లో ఏకంగా 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో వస్తులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయని ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో లభ్యమయ్యే వస్తువులన్నీ ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కేవీఐసీ చైర్మన్ వినయ్ కుమార్ సక్సెనా ఈ వెబ్ సైట్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    ekhadiindia.com వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను ఇంటి దగ్గరకు డోర్ డెలివరీ పొందే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ ఉత్పత్తులకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతుండటంతో కేంద్రం ప్రజలకు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులు మరింత చేరువ అయ్యేలా వెబ్ సైట్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.