ఏపీలో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించిన, నమోదు చేసుకున్న విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీ విద్యాశాఖ ఇటీవల రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.