https://oktelugu.com/

తప్పటడుగులు వేస్తున్న బండి సంజయ్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఘాటు వాఖ్యలతో విరుచుకుపడడంతో జనాల్లో ఉద్రేకం తెప్పిస్తోంది. అయితే సంజయ్ ఇచ్చే కొన్ని హామీలతో  ప్రజల్లో చులకన అయిపోతున్నారు. ఇటీవల బీజేపీ మెనిఫెస్టోను విడుదల చేసింది. అయితే అంతకంటే ముందే ప్రజలను ఆకర్షించడానికి కొన్ని హామీలను ఇచ్చాడు బండి. ఇప్పడు వాటిపై సోషల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 11:01 AM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఘాటు వాఖ్యలతో విరుచుకుపడడంతో జనాల్లో ఉద్రేకం తెప్పిస్తోంది. అయితే సంజయ్ ఇచ్చే కొన్ని హామీలతో  ప్రజల్లో చులకన అయిపోతున్నారు. ఇటీవల బీజేపీ మెనిఫెస్టోను విడుదల చేసింది. అయితే అంతకంటే ముందే ప్రజలను ఆకర్షించడానికి కొన్ని హామీలను ఇచ్చాడు బండి. ఇప్పడు వాటిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

    Also Read: గ్రేటర్ లో బీజేపీకి విజయం ఎందుకు అవసరం?

    హైదాబాద్ లో ఇటీవల వరదల కారణంగా నగరం జనం తీవ్రంగా నష్టపోయింది. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆస్టి నష్టం భారీగానే జరిగింది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం వరదసాయం విషయంలో కొన్ని తప్పిదాలు చేయడంతో వాటిని బీజేపీ ఎప్పటి నుంచో ఎత్తి చూపుతోంది. దీంతో తాము వరదసాయం టీఆర్ఎస్ ఇచ్చేకంటే డబుల్ ఇస్తామని ప్రచారం చేస్తున్నారు.

    ఇక వరదల కారణంగా కొన్ని వాహనాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని పనికిరాకుండా పోయాయి. బండి సంజయ్ ఈ విషయంపై మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వాహనం బదులు మరో వాహనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరి బండి ధ్వంసమైనా వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని చెప్పొకొచ్చారు. కాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వూలో బండి సంజయ్ మాట్లాడుతూ వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటుందిగా.. వాటిని చెల్లించేలా చేస్తామని తెలిపాడు.

    Also Read: హైదరాబాద్ పర్యటన: కేసీఆర్ కు షాకిచ్చిన మోడీ

    మరోవైపు ఈ వ్యాఖ్యలు చేసిన వీడియోను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దుబ్బాక ఎన్నిక తరువాత మంచి పట్టు సాధిస్తున్న బండి సంజయ్ ఇలాంటి హామీల విషయంలో తప్పటడుగులు వేయడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా వాహనాల ఇన్సూరెన్స్ ను ఎవరికి వారు తెచ్చుకోలేరా..? దానిని ఎన్నికల హామీగా ఎలా ఇస్తారని కామెంట్లు పెడుతున్నారు.

    హామీలు ఇచ్చే విషయంలో పార్టీకి పెద్దగా ఉన్న సంజయ్ ఆలోచించాలని సూచిస్తున్నారు. ఇలా ఒక్కసారిగా బండి సంజయ్ ఇమేజ్ కి గ్రాఫ్ పడిపోకముందే సరైన హామీలు ఇవ్వాలంటున్నారు విశ్లేషకులు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్