కరోనాతో శ్వాస సమస్యలా? ఆస్పత్రికి వెళ్లకుండా డాక్టర్ల సూచనలివీ?

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని ఆవహించింది. దేశంలో మరణ మృదంగం వినిపిస్తోంది. కరోనా అన్న పేరు వింటేనే గుండె గుబేలుమంటోంది. ఆ వైరస్ సోకిందని తెలియగానే భయంతో బిక్కచచ్చిపోతున్నారు. ఆ భయమే అందరినీ కబళిస్తోంది. ఊపిరి ఆడడం లేదని ఆక్సిజన్ సిలిండర్ల వైపు పరిగెడుతున్నారు. కరోనాతో ఏర్పడే ప్రధాన మైన సమస్య శ్వాస సమస్య. ఊపిరి ఆడకుండా చేసి మనిషిని చంపేస్తుంది ఈ మహమ్మారి. కరోనా వైరస్ పట్టుకునేదే ఊపిరితిత్తులను.. దీంతో ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం […]

Written By: NARESH, Updated On : April 28, 2021 10:41 am
Follow us on

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని ఆవహించింది. దేశంలో మరణ మృదంగం వినిపిస్తోంది. కరోనా అన్న పేరు వింటేనే గుండె గుబేలుమంటోంది. ఆ వైరస్ సోకిందని తెలియగానే భయంతో బిక్కచచ్చిపోతున్నారు. ఆ భయమే అందరినీ కబళిస్తోంది. ఊపిరి ఆడడం లేదని ఆక్సిజన్ సిలిండర్ల వైపు పరిగెడుతున్నారు. కరోనాతో ఏర్పడే ప్రధాన మైన సమస్య శ్వాస సమస్య. ఊపిరి ఆడకుండా చేసి మనిషిని చంపేస్తుంది ఈ మహమ్మారి. కరోనా వైరస్ పట్టుకునేదే ఊపిరితిత్తులను.. దీంతో ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ప్రముఖ నేచర్ క్యూర్ డాక్టర్ చెప్పిన అద్భుతమైన విషయాలివీ..

కరోనా వచ్చిన వారిలో ప్రధానంగా ఏర్పడేది శ్వాస సమస్యలు.. దీనివల్ల అందరూ ఇంటి నుంచి హాస్పిటల్స్ లో చేరుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం వారు శ్వాస సమస్య విషయంలో కంగారుపడిపోవడమే.. దీనికి సింపుల్ చిట్కాలను వైద్యులు సూచిస్తున్నారు. తద్వారా ఆస్పత్రికి వెళ్లకుండానే శ్వాస సమస్యను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.

ఈ కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించాక తొలుత ప్రభావం పడేది మనిషి ఊపిరి తిత్తులపైనే.. దీంతో మన శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ క్రమంగా పడి పోతుంటాయి. సరిగ్గా ఇదే టైమ్ లో అలవాటు ప్రకారం వండిన ఆహారం తినడం వలన ఈ వండిన ఆహారంలో ఆక్సిజన్ ఉండదు గనుక దీన్ని అరిగించడానికి శరీరంలో ఉన్న ఆక్సీజన్ అటు ఖర్చవుతుంటుంది. అప్పుడు ఇంకా ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయి.. ఆయాసం ఎక్కువై ఊపిరి ఆడని పరిస్థితి ఎదురవుతుంది.

కరోనా వచ్చిన వారు ఈ సమస్య రాకుండా ఉండాలంటే వండిన ఆహారం తగ్గించి వండని ఆహారం తీసుకోవడం చాలా మంచిది. కనీసం సాయంత్రం ఫుడ్ గా ఫ్రూట్స్ తినడం వలన ఆక్సీజన్ సమస్య రానే రాదు. ఎందుకంటే ఫ్రూట్స్ లో ఆల్రెడీ ఆక్సీజన్ ఉంటుంది. అది మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ను అందించి సరిపోతుంది. ఆరిగించడానికి ఇదే ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. సో శరీరానికి ఆక్సిజన్ సమస్య రాదు. ఇది తెలియక చాలా మంది కరోనా వస్తే బాగా తినాలని చెప్పి వండినవన్నీ కడుపు నిండా తింటున్నారు. దీనివలన ఈ శ్వాససమస్యలు ఎక్కువ గా వస్తున్నాయి.

+ కరోనా సోకిన వారు ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవీ..
– ఉదయం నాన బెట్టిన డ్రైఫ్రూట్స్, సాయంత్రం డిన్నర్ గా 7 గంటలలోపు ఫ్రూట్స్ తినాలని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం మనకిష్టమైన అన్నం కూరలు లైటుగా తినాలి. ఆయాసం అనే సమస్యే దీంతో రాదు. మందులు వేసుకునే వారు డ్రైఫ్రూట్స్ , ఫ్రూట్స్ తిని వేసుకోవచ్చు. మందులు వేసుకోవడం కోసం ప్రత్యేకంగా మళ్లీ టిఫిన్స్ తినాల్సిన పనిలేదు.

– మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కరోనా వచ్చిన వారికి ఆక్సిజన్ సమస్య రాకుండా ప్రాణాయామాలు (ఓంకారం మరియు అనులోమ విలోమ ) ఎంతగానో ఉపయోగపడతాయి. ఐతే ప్రాణాయామాలు ఉదయం, సాయంత్రం పొట్ట ఖాళీగా వున్నప్పుడు మాత్రమే చెయ్యాలి.

-చివరగా ఒక చిట్కా.. కరోనా వచ్చిన వారు వెల్లికిలా పడుకోకుండా శరీరం సహకరించేంత వరకు బోర్లా పడుకోవడం మంచిది. ఇలా పడుకుంటే ఊపిరితిత్తులకు శ్వాసను తీసుకోవడం ఇబ్బంది కాదు.. వాటిపై భారం పడకుండా తేలిగ్గా శ్వాసను తీసుకోవచ్చు. ఇలా చేస్తే కరోనా వచ్చినా శ్వాస సమస్య రాకుండా ఇంట్లోనే చికిత్సను పొందవచ్చు. విజయవంతంగా దాన్ని జయించవచ్చు.