https://oktelugu.com/

మరో బాంబ్ పేల్చడానికి రెడీ అయిన బీజేపీ

బీజేపీ తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశంలో చిచ్చుపెట్టింది. ఒక వర్గం రోడ్డెక్కేలా చేసింది. ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. సీఏఏ అమలుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయి. హింసాత్మకంగా మారాయి. అల్లర్లను కంట్రోల్ చేయడంలో ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. అల్లర్లకు బాధ్యత ఎవరిదనిపై అటూ బీజేపీ, ఇటూ ఆప్, వామపక్ష పార్టీలపై ఆరోపణలు చేసుకున్నాయి. Also Read: గ్రేటర్ ఎఫెక్ట్.. ఒక్కటవుతున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్..! ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇప్పటికే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2020 10:25 am
    Follow us on

    CAA,NRC

    బీజేపీ తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశంలో చిచ్చుపెట్టింది. ఒక వర్గం రోడ్డెక్కేలా చేసింది. ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. సీఏఏ అమలుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయి. హింసాత్మకంగా మారాయి. అల్లర్లను కంట్రోల్ చేయడంలో ఢిల్లీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పించింది. అల్లర్లకు బాధ్యత ఎవరిదనిపై అటూ బీజేపీ, ఇటూ ఆప్, వామపక్ష పార్టీలపై ఆరోపణలు చేసుకున్నాయి.

    Also Read: గ్రేటర్ ఎఫెక్ట్.. ఒక్కటవుతున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్..!

    ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇప్పటికే 50 మందికి మృతిచెందారు. ఒక ఐబీ అధికారి అంకిత్ శర్మ మరణించడం శోచనీయం. అంకిత్ శర్మ మృతిచెందడానికి ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ తాహిర్ హుసేన్ కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చాలా మంది మృతిచెందారు. మిస్సింగ్ కేసులు ఉన్నాయి.  ఇప్పటికీ ఢిల్లీ సీఏఏ పేరు చెబితే వణుకుతుంది.

    బంగ్లాదేశ్, పాకిస్తాన్, అప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు వచ్చిన శరణార్థులను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది..అప్పుడు ఆందోళనలతో ఆగిన ఈ చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి రెడీ అవుతోంది.ఇదే మరోసారి దేశంలో ఏం జరుగుతుందనేది ఆందోళ కలిగిస్తోంది.

    Also Read: కాంగ్రెస్ లో చిచ్చుపెడుతున్న టీపీసీసీ.. తీరుమార్చుకోని నేతలు..!

    అయితే ఈ బిల్లుపై వెనక్కి తగ్గుందని అందరూ భావించగా బీజేపీ మరోసారి తెరమీదకు తెచ్చింది. అగ్నికి ఆజ్యం పోసింది. వచ్చే ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని బీజేపీ అమలు చేయడానికి రెడీ కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.

    2021 జనవరి నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తోన్న శరణార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వాన్ని కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర 24 పరగణ జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలను సంధించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్