లవంగం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మనలో చాలామంది రోజూ ఉదయం, సాయంత్రం కాఫీ, టీ తీసుకుంటూ ఉంటారు. కాఫీ, టీలు తాగడం వల్ల తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. టీలతో ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉండగా అందులో లవంగం టీ కూడా ఒకటి. లవంగం టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సాధారణ టీని ఏ విధంగా చేసుకుంటారో లవంగం టీ కూడా అదే విధంగా తయారు చేసుకోవచ్చు. Also Read: పుదీనా వల్ల […]

Written By: Navya, Updated On : January 12, 2021 4:46 pm
Follow us on

మనలో చాలామంది రోజూ ఉదయం, సాయంత్రం కాఫీ, టీ తీసుకుంటూ ఉంటారు. కాఫీ, టీలు తాగడం వల్ల తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. టీలతో ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉండగా అందులో లవంగం టీ కూడా ఒకటి. లవంగం టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సాధారణ టీని ఏ విధంగా చేసుకుంటారో లవంగం టీ కూడా అదే విధంగా తయారు చేసుకోవచ్చు.

Also Read: పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

లవంగాలను ముక్కచెక్కలుగా దంచుకుని మొదట ఒక పాత్రలో నీటిని మరిగించాలి. మరిగించిన నీటిలో లవంగాల పొడి, చక్కెర లేదా తేనె వేసుకుని లవంగం టీని తయారు చేసుకోవచ్చు. లవంగం టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. లవంగం టీ తాగడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులకు సులభంగా చెక్ పెట్టవచ్చు. లవంగం దంతాల్లో నొప్పి, చిగుళ్లలో వాపు లాంటి సమస్యలకు సులభంగా చెక్ పెడుతుంది.

Also Read: సోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

లవంగం టీని పుక్కిలించి ఉమ్మేయడం ద్వారా నోటిలోని బ్యాక్టీరియాకు సులభంగా చెక్ పెట్టవచ్చు. లవంగం టీలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. జ్వరంతో బాధ పడేవాళ్లు లవంగం టీ తాగడం వల్ల జ్వరం తగ్గించుకోవచ్చు. గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధ పడేవాళ్లకు లవంగం టీ దివ్యౌషధంలా పని చేస్తుంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

చాలామంది అజీర్తి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. లవంగం టీ అజీర్తి సమస్యకు చెక్ పెట్టడంలో కూడా సహాయపడుతుంది. షుగర్ తో బాధ పడేవాళ్లు లవంగం టీ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. లవంగం టీ అధిక బరువును తగ్గించడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయపడుతుంది.