https://oktelugu.com/

కేసీఆర్, జగన్ ల మధ్య బీజేపీ చిచ్చు!

చిరకాల మిత్రులు కాస్త ఆగర్భ శత్రువులు అయ్యారు. కేంద్రంలో పవర్ ఉంటే కొండమీది కోతిని కూడా ఆడించవచ్చని బీజేపీ నిరూపిస్తోంది. అన్ని రాష్ట్రాలను గుప్పిటపట్టి వారి లూప్ హోల్స్ తో ఆటలాడుతోంది. అందుకే ఇప్పుడు అన్నాదమ్ములు కలిసి ఉన్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య కూడా బీజేపీ చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పడు దూరం దూరంగా ఉంటున్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదశ్ రాష్ట్రాలు ఒకే తల్లిబిడ్డల్లాంటివి.. ఇరు రాష్ట్రాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 09:28 AM IST
    Follow us on

    చిరకాల మిత్రులు కాస్త ఆగర్భ శత్రువులు అయ్యారు. కేంద్రంలో పవర్ ఉంటే కొండమీది కోతిని కూడా ఆడించవచ్చని బీజేపీ నిరూపిస్తోంది. అన్ని రాష్ట్రాలను గుప్పిటపట్టి వారి లూప్ హోల్స్ తో ఆటలాడుతోంది. అందుకే ఇప్పుడు అన్నాదమ్ములు కలిసి ఉన్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య కూడా బీజేపీ చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పడు దూరం దూరంగా ఉంటున్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదశ్ రాష్ట్రాలు ఒకే తల్లిబిడ్డల్లాంటివి.. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళితే తెలుగు ప్రజలు అభివృద్ధి చెందుతారు.. అందువల్ల ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తాం..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సందర్భంలో ప్రకటించారు. ఆ మధ్య నీటి పంపకాల విషయంలో ఇద్దరు సీఎంలు, జగన్, కేసీఆర్ ల మధ్య విభేధాలు తలెత్తాయని వార్తలు వస్తే దానిని కేసీఆర్ కొట్టి పారేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణమే ఉంటుందని తేల్చి చెప్పారు. కానీ ఇటీవల జగన్ తో కేసీఆర్ సంబంధాలు తెంచుకున్నారా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.

    Also Read: కెసిఆర్ మోడీపై సమరంలో పస ఉందా?

    పోలవరం ప్రాజెక్టు, ఇతర విషయాల్లో ఏపీ సీఎం జగన్ మాటిమాటికి ఢిల్లీ వెళ్తున్న విషయం తెలిసిందే. అధిష్టానం పెద్దలైన మోదీ, అమిత్ షాతో పలుమార్లు భేటీ కూడా అయ్యారు. మరోవైపు గత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో జగన్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ ఎన్నిక తరువాత నుంచి జగన్ బీజేపీ పై విమర్శలు కూడా చేయడం లేదు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా కేంద్రంలో మాత్రం జగన్ బీజేపీకి మద్దతుదారుడే అని తేలిపోయింది.

    తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంతో కేసీఆర్ ఆ రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక తరువాత బీజేపీపై పోరాటాన్ని కేసీఆర్ మరింత ఉధృతం చేశారు. దీంతో బీజేపీపై దేశవ్యాప్తంగా పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ రెండో వారంలో జాతీయ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి మమతా బెనర్జీ లాంటి నాయకులను ఆహ్వానించారు.

    Also Read: బీజేపీ అసలు టార్గెట్ అదేనా

    కానీ పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పేరును కేసీఆర్ ఎత్తలేదట. దేశంలోని ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తున్న కేసీఆర్.. పక్కనే ఉండే ఏపీ సీఎం జగన్ ను మాత్రం ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఆయనను పిలవకూడదని కేసీఆర్ నిర్ణయించాడట. దీంతో జగన్ పై కేసీఆర్ మనసు మార్చకున్నట్లు తెలుస్తోంది. ఇక రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలోనూ ఏపీ దూకుడుకు కేసీఆర్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్, జగన్ ల మధ్య బీజేపీ చిచ్చుపెట్టనట్లయింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్