https://oktelugu.com/

మహేష్ బాబు చిల్ అవడానికి ఏం చేస్తాడో తెలుసా?

టాలీవుడ్లోని హీరోలందరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా డిఫరెంట్. సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ తన బాధ్యతలను మాత్రం నెరవేస్తూ తోటి హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్టార్ హీరోలంతా చిల్ అయ్యేందుకు ఫ్రెండ్స్.. పార్టీలతో సేదతీరుతూ స్ట్రెస్ ను తగ్గించుకుంటూ ఉంటారు. మహేష్ బాబు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. తప్పనిసరి అయితే తప్ప పార్టీల్లో మహేష్ కన్పించడం చాలా అరుదు. Also Read: పవన్ కళ్యాణ్ తో రానానే.. ఫిక్స్ మహేష్ బాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 09:33 AM IST
    Follow us on

    టాలీవుడ్లోని హీరోలందరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా డిఫరెంట్. సినిమాల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ తన బాధ్యతలను మాత్రం నెరవేస్తూ తోటి హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. స్టార్ హీరోలంతా చిల్ అయ్యేందుకు ఫ్రెండ్స్.. పార్టీలతో సేదతీరుతూ స్ట్రెస్ ను తగ్గించుకుంటూ ఉంటారు. మహేష్ బాబు మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. తప్పనిసరి అయితే తప్ప పార్టీల్లో మహేష్ కన్పించడం చాలా అరుదు.

    Also Read: పవన్ కళ్యాణ్ తో రానానే.. ఫిక్స్

    మహేష్ బాబు తన సినిమాలతో ఎప్పుడు తీరిక లేకుండా గడుపుతుంటాడు. అయినప్పటికీ తన ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తుంటాడు. తన సినిమాకు ముందుగానీ లేదా పూర్తయిన తర్వాతగానీ మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. తన సినిమాల విషయంలో మహేష్ ఎంత ప్లానింగ్ తో ఉంటాడో ఫ్యామిలీపై కేర్ తీసుకోవడంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటాడు.

    టాలీవుడ్లో చాలామంది హీరోలు ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తుంటారుగానీ మహేష్ బాబు అంతస్థాయిలో కమిట్ మెంట్ చూపేవాళ్లు మరొకరు ఉండరనే చెప్పొచ్చు. సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ తన స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి మాత్రం ఆయన తన ఫ్యామిలీతోనే గడుపుతుంటాడు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఫ్యామిలీతో టూర్స్ కు వెళుతూ చిల్ అవుతూ ఉంటాడు.

    Also Read: యాక్షన్ అంటేనే భయపడుతున్న యాక్షన్ డైరెక్టర్ !

    మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ వెళ్లడం అనేది ఇటీవలీ కాలంలో కామన్ అయిపోయింది. కరోనా టైంలోనూ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి తాజాగా అమెరికా వెళ్లాడు. త్వరలోనే మహేష్ నటిస్తున్న ‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్ కూడా అమెరికాలో జరుగనుంది. అక్కడే మహేష్ బాబు ఫ్యామిలీతో కొన్ని రోజులు ఉండనున్నాడు.

    మహేష్ బాబు అమెరికాలో భార్యపిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నాడు. మహేష్ బాబు తన కుటుంబంపై చూపుతున్న కమిట్ మెంట్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్లో మహేష్ బాబు మించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్