ఎయిర్ పోర్టుకు బీజేపీ కార్యకర్తలు.. అడ్డుకున్న పోలీసులు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి నగరానికి వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు భారీగా బీజేపీ కార్యకర్తలు, ఈటల అభిమానులు చేరుకున్నారు. కాగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తోన్న ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా ఎయిర్ పోర్టులోకి బీజేపీ కార్యకర్తలను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం […]
Written By:
, Updated On : June 15, 2021 / 12:16 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి నగరానికి వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు భారీగా బీజేపీ కార్యకర్తలు, ఈటల అభిమానులు చేరుకున్నారు. కాగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వస్తోన్న ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా ఎయిర్ పోర్టులోకి బీజేపీ కార్యకర్తలను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.