ఎన్నాళ్లో వేచిన సాయంత్రం ఈరోజు మాజీ మంత్రి అఖిలప్రియకు వచ్చింది. సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఎట్టకేలకు ఈరోజు చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
Also Read: దేశానికి 4 రాజధానులు.. బాంబు పేల్చిన బెంగాల్ సీఎం
కిడ్నాప్ కేసులో నిన్న కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే షరతులతో కూడిన బెయిల్ ను సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. 15 రోజులకు ఒకసారి బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అఖిలప్రియ విడుదల సందర్భంగా చంచల్ గూడ జైలు వద్ద సందడి నెలకొంది. ఆమె బంధువులు, ఆళ్లగడ్డ, నంద్యాల నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. దీంతో జైలు వద్ద అలజడి నెలకొంది.
Also Read: సుప్రీంకోర్టే ఇక కీరోల్.. ఏపీలో ఎన్నికలు ఏం కానున్నాయి?
ఇప్పటికే మూడు సార్లు బెయిల్ కోసం అఖిలప్రియ కోర్టులో పిటీషన్ వేయగా మూడోసారి ఆమెకు బెయిల్ మంజూరైంది. అఖిలప్రియకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ కోర్డు తెలిపింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేసిన వైనం సంచలనమైంది. ఈ కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, ఇతడి సోదరుడు, ఏవీ సుబ్బారెడ్డిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. హఫీజ్ పేటలోని 50 ఎకరాల భూమి గురించే ఈ కిడ్నాప్ చోటు చేసుకుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్