బాహుబలి లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత డార్లింగ్ ప్రభాస్ సాహో మూవీతో ఇండియా మొత్తం అలరించి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. డార్లింగ్ ఇప్పుడు వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాత ‘ఆది పురుష్’, ‘సలార్ ‘ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఈ నెలలోనే సెట్స్ పైకి వెళుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
Also Read: రొమాంటిక్ సాంగ్ లో ‘బన్నీ – రష్మిక’ !
తాజాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ నుండి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకి వచింది. ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి నటన చూసిన తర్వాత అందరికీ విలన్ గా తీసుకోవాలనే ఆసక్తి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీలో విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకున్నారని ప్రచారం మొదలైంది.
అయితే విజయ్ కంటే ముందే ఈ మూవీలో ప్రభాస్ ని ఢీకొట్టడానికి విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం సరిపోతారని మేకర్స్ భావించారు. ఈ మేరకు ఈ స్టార్ తో సంప్రదింపులు కూడా జరిపినట్లుగా, త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్ అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం.
Also Read: ఆచార్య కోసం వెంటనే ఒప్పేసుకుంది !
అయితే ఇప్పటికే ప్రభాస్ ఆది పురుష్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ లో కూడా ప్రభాస్ పక్కన బాలీవుడ్ స్టార్ ని కాకుండా తమిళ హీరో /విలన్ విజయ్ సేతుపతినే ఖాయం చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నాడట.. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్