సుశాంత్ సింగ్ మరణం వెనుక మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన సర్కార్ హస్తం ఉందని.. వారే సుశాంత్ హత్యను తొక్కిపెడుతున్నారని బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ అప్పట్లో నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన మండిపడడం.. ఆమెకు వార్నింగ్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏకంగా కంగనకు వై కేటగిరి భద్రత కల్పించడం ఇలా వరుస పరిణామాలు సెగలు రేపాయి.. ఈ క్రమంలోనే ఆమె ఆఫీసు కూల్చివేత జరగడం.. తాజాగా దీనిపై హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ ఫైట్ లో కంగననే గెలిచినట్టైంది.
Also Read: బాలీవుడ్ ‘ఛత్రపతి’గా ఆ హీరో రాణిస్తాడా?
బీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ కంగనా చేసిన న్యాయ పోరాటం ఫలించినట్టైంది. కూల్చివేతపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు సుధీర్ఘ వాదనలు అనంతరం హైకోర్టు శుక్రవారం తుది తీర్పును ఇచ్చింది. కంగనా కార్యాలయాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తీర్పులో వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో పోరాడి మొత్తానికి కంగనా గెలిచేసింది.
Also Read: ఇండస్ట్రీ చూపంతా ప్రభాస్ పైనే.. మూడు సిమాలకే వెయ్యి కోట్లు..!
మహారాష్ట్రసర్కార్ ను ఢీకొట్టి కేసుల పాలైన బాలీవుడ్ నటి కంగనా రౌనత్ కు ముంబై హైకోర్టులో భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమమంటూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది కంగనా రౌనత్. చట్టప్రకారం నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చివేశారని తాజాగా హైకోర్టు మండిపడింది. పిటీషనర్ కు జరిగిన నష్టాన్ని చెల్లించాలని ముంబై మున్సిపాలిటీని ఆదేశించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్