వీకెండ్ మస్తీ.. ఆ స్పాలు, క్లబ్ లలో వ్యభిచారం

వారాంతం వచ్చిందంటే చాలు యువత రెచ్చిపోతుంటారు. చిన్న చిన్న పట్టణాల్లో అయితే కుదరని ఎంజాయ్ మెంట్ మెట్రో నగరాల్లో ఎక్కువవుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరు తమ సుఖం కోసం క్లబ్బులు, హోటళ్లు, స్పాల్లో హంగామా చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రత్యేకంగా గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా బెంగుళూరు పోలీసులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఇందులో ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్ లో దొరికిన వారిని తరలించడానికి బస్సుల్ని […]

Written By: Srinivas, Updated On : August 3, 2021 10:44 am
Follow us on

వారాంతం వచ్చిందంటే చాలు యువత రెచ్చిపోతుంటారు. చిన్న చిన్న పట్టణాల్లో అయితే కుదరని ఎంజాయ్ మెంట్ మెట్రో నగరాల్లో ఎక్కువవుతోంది. వయసుతో సంబంధం లేకుండా అందరు తమ సుఖం కోసం క్లబ్బులు, హోటళ్లు, స్పాల్లో హంగామా చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ప్రత్యేకంగా గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా బెంగుళూరు పోలీసులు జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. ఇందులో ఆశ్చర్యకర అంశాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్ లో దొరికిన వారిని తరలించడానికి బస్సుల్ని పిలిపించాల్సి రావడం గమనార్హం.

మొత్తం మూడు వందల మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. జల్సాలకు ఇంత హడావిడి చేయడానికి వచ్చి అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం. బెంగుళూరు నగరంలో వారాంతాల్లో క్లబ్బులు, హోటళ్లు, స్పాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో వ్యభించారం జరుగుతున్నట్లు సమాచారం. క్లబ్బులు, హోటళ్లలో ప్రధాన వ్యాపారం వ్యభిచారమేనని తెలుస్తోంది. దీంతో అక్కడ దొరికిన విటుల్ని, యువతుల్ని అరెస్టు చేశారు. అయితే దీని వెనుక పెద్ద రాకెట్ ఉందని అనుమానిస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో పట్టుబడటంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బెంగుళూరు నగరంలో ఇంత పెద్ద మొత్తంలో వ్యభిచారం జరగడంపై దృష్టి సారిస్తున్నారు. అంతే కాదు దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది. పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిన యువత పెడదోవ పడుతూ దానికి ఎంజాయ్ మెంట్ అని పేరు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసినప్పుడల్లా వారికి చిక్కుతూనే ఉన్నారు. కానీ వారికి శిక్షలు ఉండకపోవడంతో వారు దొరికినప్పుడల్లా వదిలేయడంతో ఏం పట్టించుకోవడం లేదు.

దీంతో వారి వ్యాపారం మూడు రాత్రులు ఆరు హోటళ్లలాగా సాగుతోంది. ఏ అమావాస్యకో పౌర్ణమికో దాడులు చేయడంతో ఎవరు కూడా అంత ప్రాధాన్యం ఇవ్వకుండా వారి వారి జల్సాల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పటికైనా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న వ్యభిచారాలపై స్పందించి వాటిని అరికట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.