https://oktelugu.com/

వీడియో: సిరాజ్ పై బెన్ స్టోక్స్ స్లెడ్జింగ్..విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్

ఆస్ట్రేలియాతో ఢీ అంటే ఢీ అంటూ స్లైడ్జింగ్ చేసి ఆటలో కూడా దూకుడుగా ఆడి చిత్తు చేసిన భారత్ తో ఇన్నాళ్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు పెట్టుకోలేదు. అయితే కీలకమైన 4వ టెస్టులో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ లో ఎదురీదుతోంది. కెప్టెన్ రూట్ ను ఔట్ చేసి సిరాజ్ .. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు బౌన్సర్ విసిరాడు.. దీంతో కోపం తట్టుకోలేకపోయిన బెన్ స్టోక్ సిరాజ్ పై దురుసు పదజాలంతో నోరు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 4, 2021 / 08:49 PM IST
    Follow us on

    ఆస్ట్రేలియాతో ఢీ అంటే ఢీ అంటూ స్లైడ్జింగ్ చేసి ఆటలో కూడా దూకుడుగా ఆడి చిత్తు చేసిన భారత్ తో ఇన్నాళ్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు పెట్టుకోలేదు. అయితే కీలకమైన 4వ టెస్టులో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ లో ఎదురీదుతోంది. కెప్టెన్ రూట్ ను ఔట్ చేసి సిరాజ్ .. ఆ తర్వాత ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు బౌన్సర్ విసిరాడు..

    దీంతో కోపం తట్టుకోలేకపోయిన బెన్ స్టోక్ సిరాజ్ పై దురుసు పదజాలంతో నోరు జారాడు. దాంతో ఈ విషయాన్ని కోహ్లీకి సిరాజ్ వివరించాడు. వెంటనే రియాక్ట్ అయిన కోహ్లీ అక్కడి నుంచి స్టోక్స్ వద్దకు వెళ్లి తగిన రీతిలో సమాధానం ఇచ్చాడు.

    కోహ్లీ, స్టోక్స్ కొట్టుకుంటారేమో అన్నంతగా వెంటనే ఎంపైర్లు రంగ ప్రవేశం చేసి ఇద్దరి ఆటగాళ్లకు సర్ధి చెప్పారు.

    దీనిపై సిరాజ్ మీడియాతో మాట్లాడాడు. బౌన్సర్ వేసిన తనపై బెన్ స్టోక్స్ దురుసుగా మాట్లాడాడని.. విషయం విరాట్ కోహ్లీకి చెప్పానని.. ఆ తర్వాత అతడు గట్టి సమాధానం చెప్పాడని సిరాజ్ పేర్కొన్నాడు.

    https://twitter.com/CloudyMahesh/status/1367345903401496579?s=20