https://oktelugu.com/

ఉద్యోగులకు ఆ రెండు కంపెనీలు శుభవార్త.. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్..?

దేశంలో నెలన్నర క్రితం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవచ్చు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. Also Read: ఒకే డోసుతో కరోనా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 4, 2021 / 08:29 PM IST
    Follow us on

    దేశంలో నెలన్నర క్రితం కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వారు, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవచ్చు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

    Also Read: ఒకే డోసుతో కరోనా ఖతం..

    అయితే ప్రముఖ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు, ఉద్యోగుల్ కుటుంబ సభ్యులకు అదిరిపోయే శుభవార్త చెప్పాయి. ఇన్ఫోసిస్, యాక్సెంచర్ కంపెనీలు ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్ కోసం అయ్యే ఖర్చును భరిస్తామని వెల్లడించాయి. ఇన్ఫోసిస్ ప్రైవేటు ఆస్పత్రులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొని ఉద్యోగులకు టీకా అందజేసే ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించింది.

    Also Read: కరోనా టీకా అమ్మకాలు షురూ..రేటు ఫిక్స్ చేసిన కేంద్రం.. ఖరీదు ఎంతంటే?

    అమెరికా కేంద్రంగా పని చేస్తున్న యాక్సెంచర్ ఉద్యోగులు, ఉద్యోగులపై ఆధారపడిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్ కు అయ్యే ఖర్చును భరిస్తామని తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ కంపెనీలు కూడా ఉద్యోగుల కొరకు టీకాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చింది.

    మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

    ఎవరైతే కరోనా వ్యాక్సిన్ ను ముందుగా తీసుకోవాలని అనుకుంటారో వాళ్లు కొవిన్ పోర్టల్‌ లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.