కళ్ళు తెరిచి తుమ్మాడు.. ఆ తర్వాత ఏం జరిగింది.?

జలుబు అయ్యిందంటే చాలు చాలామందికి తుమ్ములు ఆటోమేటిక్ గా వస్తాయి. వాటిని ఎవరూ ఆపలేరు.. అయితే జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ములను కొంత వరకు ఆపవచ్చు. కానీ దాదాపుగా ప్రతి ఒక్కరు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సందర్భంలో తుమ్ముతారు. అందుకు అలర్జీలు, దుమ్ము వంటి కారణాలు ఉంటాయి. అయితే ఎవరు, ఎప్పుడు, ఎలా తుమ్మినా కచ్చితంగా కళ్లు మూసుకునే తుమ్ముతారు. కళ్లు తెరిచి ఎవరూ తుమ్మరు. అలా కళ్లు తెరిచి తుమ్మితే […]

Written By: NARESH, Updated On : November 22, 2020 8:42 pm
Follow us on

జలుబు అయ్యిందంటే చాలు చాలామందికి తుమ్ములు ఆటోమేటిక్ గా వస్తాయి. వాటిని ఎవరూ ఆపలేరు.. అయితే జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ములను కొంత వరకు ఆపవచ్చు. కానీ దాదాపుగా ప్రతి ఒక్కరు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సందర్భంలో తుమ్ముతారు. అందుకు అలర్జీలు, దుమ్ము వంటి కారణాలు ఉంటాయి. అయితే ఎవరు, ఎప్పుడు, ఎలా తుమ్మినా కచ్చితంగా కళ్లు మూసుకునే తుమ్ముతారు. కళ్లు తెరిచి ఎవరూ తుమ్మరు. అలా కళ్లు తెరిచి తుమ్మితే కనుగుడ్డు బయటకి పడతాయని అధికశాతం మంది నమ్ముతారు. అయితే అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం తుమ్మినప్పుడు ఓ నాడి మెదడుకు సిగ్నల్ పంపుతుందని పరిశోధనల్లో తేలింది. దాంతో మనం ఆటోమేటిక్ గా కళ్లు మూసుకుంటాం. అయితే అలా కళ్లు మూసుకోవడం మంచిదేనట.. ఎందుకంటే తుమ్మినప్పుడు ముక్కు నుంచి వచ్చే బ్యాక్టీరియా , వైరస్ లు కళ్లలోకి వెళ్లకుండా ఉంటాయట.. అందుకే తుమ్మినప్పుడు మనం ఖచ్చితంగా కళ్లు మూసుకుంటామట.. అయితే దాదాపుగా చాలా తక్కువ మంది మాత్రమే కళ్లు తెరిచి తుమ్మగలరు..

కళ్లకు, ముక్కుకు డైరెక్ట్ గా సంబంధం ఉండదని పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు తుమ్ము ఎంత వేగంగా వచ్చినా కళ్లు తెరిచి తుమ్మితే దాంతో కళ్లు మాత్రం బయటపడవు. ఎందుకంటే  కళ్లు ఆరు రకాల ఎక్స్ ట్రా ఓక్యూలర్ కండరాలతో నిర్మాణమవుతాయి. కాబట్టి అవి అంత తేలిగ్గా ఊడి బయటకు పడవు. కళ్లు తెరిచి తుమ్మడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదట.. అలా చేయడం కొందరికే సాధ్యమవుతుందట.. అయితే కళ్లు తెరిచి తుమ్మినా కళ్లు మాత్రం బయటపడవు. కళ్లు వాటి స్థానంలో చాలా గట్టిగా.. ధృడంగా పాతుకుని ఉంటాయి. తుమ్మే సమయంలో ఎంత తెరిచి ఉంచినా కచ్చితంగా మనం కళ్లు ఆటోమేటిక్ గా మెదడు ఆదేశానుసారం మూసుకుపోతాయని పరిశోధనల్లో తేలింది.