
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో బ్యాంకులు ఖాతాదారులకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తక్కువ వడ్డీకే ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు అనే తేడాల్లేకుండా అన్ని బ్యాంకులు ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ ఆఫర్ పేరుతో ఆఫర్లను ప్రకటించింది.
దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ ఆఫర్ లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ తమ బ్యాంక్ ఖాతాదారులు వెహికిల్ లోన్ తీసుకుంటే 7.99 శాతం వడ్డీరేటు, హోమ్ లోన్స్ పై 6.90 శాతం నుంచి వడ్డీరేటు ప్రారంభమవుతుందని తెలిపింది. వాహనాన్ని కొనుగోలు చేసే వారికి ఆన్ రోడ్ ధరకు సమానమైన మొత్తాన్ని బ్యాంకు లోన్ రూపంలో అందిస్తోంది. యాక్సిస్ టూ వీలర్ వాహనాలను కొనుగోలు చేసేవాళ్లకు సైతం తక్కువ వడ్డీరేటుతో ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.
యాక్సిస్ బ్యాంక్ దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు యాప్ ను ఉపయోగించి తొలి ట్రేడ్ లేదా సిప్ లావాదేవీ జరిపితే ఎడ్జ్ రివార్డ్ పాయింట్లను సైతం సులువుగా పొందే అవకాశం ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ను ఉపయోగించి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, టాటా క్లిక్ లాంటి ఈకామర్స్ వెబ్ సైట్లతో పాటు డిమార్ట్, శాంసంగ్, వెస్ట్ సైడ్ లలో షాపింగ్ చేసి డిస్కౌంట్లను పొందవచ్చు.
యాక్సిస్ బ్యాంక్ ఆరు నెలల కాల పరిమితితో తీసుకునే రుణాలకు జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు లాంటి ఆఫర్లను అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ వడ్డీరేటు 10.5 శాతంగా ఉండగా, పర్సనల్ లోన్ వడ్డీరేటు 10.9 శాతంగా ఉంది. లక్ష రూపాయల పర్సనల్ లోన్ తీసుకుంటే నెలకు రూ.2,149 చెల్లిస్తే సరిపోతుంది. యాక్సిస్ బ్యాంక్ బిజినెస్ మరియు ప్రాసెసింగ్ లోన్స్ పై డిస్కౌంట్ అందిస్తుండటం గమనార్హం. బ్యాంకులు అందిస్తున్న ఆఫర్లు తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని ఖాతాదారులు చెబుతున్నారు.