Bangalore to Hyderabad: రెండున్నర గంటల్లో బెంగళూరు టు హైదరాబాద్ వచ్చేయవచ్చు ఇలా

Bangalore to Hyderabad: హైదరాబాద్, బెంగుళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. జనాభాతో పాటు ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇవి రెండు దూసుకుపోతున్నాయి. ప్రస్తుత కాలంలో రెండు నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. మెట్రోపాలిటన్ నగరాలుగా రూపుదిద్దుకున్న ఈ నగరాల మధ్య దూరం త్వరగా చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయాభావంతో నష్టపోతున్నారు. అందుకే వారి బాధలను అర్థం చేసుకున్న రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకుంది. […]

Written By: Neelambaram, Updated On : August 18, 2022 4:34 pm
Follow us on

Bangalore to Hyderabad: హైదరాబాద్, బెంగుళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. జనాభాతో పాటు ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇవి రెండు దూసుకుపోతున్నాయి. ప్రస్తుత కాలంలో రెండు నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. మెట్రోపాలిటన్ నగరాలుగా రూపుదిద్దుకున్న ఈ నగరాల మధ్య దూరం త్వరగా చేరుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణం చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయాభావంతో నష్టపోతున్నారు. అందుకే వారి బాధలను అర్థం చేసుకున్న రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకుంది.

Bangalore

Also Read: Vijayashanthi BJP: ఆఖరుకు బీజేపీలోనూ ‘రాములమ్మ’ ఇమడలేకపోయిందే? లోపం ఎక్కడబ్బా?

హైదరాబాద్, బెంగుళూరు మధ్య హై స్పీడ్ ట్రాక్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. దీంతో ప్రయాణికులు కల నెరవేరనుంది. ట్రాక్ కు ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి బెంగుళూరు చేరుకోవాలంటే సుమారు 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. కొత్త నిర్మాణం పూర్తయితే కేవలం రెండు గంటల్లోనే వెళ్లవచ్చు. దీంతో సమయాభావం తగ్గుతుంది. ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది దీంతో రైల్వే శాఖ అంచనాలు సిద్ధం చేసింది.

Bangalore to Hyderabad

Also Read: SaiBaba Temple: అమెరికా మిచిగాన్ సాగినాలో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

కొత్తగా ఏర్పాటు చేసే సెమీ హైస్పీడ్ ట్రాక్ తో రైలు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. దీంతో గమ్యం తొందరగా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల్లో కూడా ఒకటే ఆతృత నెలకొంది. కొత్త ట్రాక్ ను బెంగుళూరులోని యెలహంక స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు నడపనుంది. దీంతో కేవలం 2.5 గంటల్లోనే రెండు నగరాలను చేరుకోవడానికి వీలు కానుంది. దీంతో రెండు నగరాల మధ్య దూరం 503 కిలోమీటర్లుగా చెబుతున్నారు. పీఎం గతివక్తి పథకంలో భాగంగా పనులు శరవేగంగా కొనసాగనున్నాయని తెలుస్తోంది.

Hyderabad

Also Read: Megastar Chiranjeevi: ఫిల్మ్ నగర్ లో విలువైన ఆస్తులను అమ్మేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..షాక్ లో ఫాన్స్

దీనికి గాను రూ.30 వేల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరు, హైదరాబాద్ మధ్య కేవలం రెండున్నర గంటల్లోనే గమ్యం చేరే విధంగా ప్లాన్ రెడీ చేస్తున్నారు. దీనికి గాను పనులు కూడా వేగంగా చేసేందుకు నిర్ణయించింది. దీంతో రెండు నగరాల మధ్య ప్రయాణించేందుకు సమయం ఆదా కానుంది. రెండు నగరాల మధ్య రాకపోకలు సులువు కానున్నాయి. రోజు ఉద్యోగాలు చేసుకుని మరీ గమ్యం చేరుకునే వెసులుబాటు కలగనుందని తెలుస్తోంది. దీనిపై అందరిలో ఒకటే ఆతృత పెరుగుతోంది.