Homeఎంటర్టైన్మెంట్Liger Censor Report: లైగర్ సినిమా సెన్సార్ టాక్ అదిరిపోయింది..సినిమాలో హైలైట్స్ ఇవేనట

Liger Censor Report: లైగర్ సినిమా సెన్సార్ టాక్ అదిరిపోయింది..సినిమాలో హైలైట్స్ ఇవేనట

Liger Censor Report: టాలీవుడ్ నుండి తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా సినిమాలలో ఒకటి విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా..ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ సెన్సషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 100 కోట్ల రూపాయలకు పైగానే జరిగింది..ఒక మీడియం బడ్జెట్ హీరో కి ఈ స్థాయి బిజినెస్ జరగడం అంటే మాములు విషయం కాదు..విజయ్ దేవరకొండ ఇక నుండి మీడియం హీరో కాదు..స్టార్ హీరో అని చెప్పకనే చెప్తుంది లైగర్ సినిమా బిజినెస్..మరి విడుదలయ్యాక ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే విజయ్ దేవరకొండ ఇక పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ రేంజ్ స్టార్ హీరో ఐపోయినట్టే లెక్క అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..మరి ఆ అంచనాలను విజయ్ దేవరకొండ అందుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే ఆగష్టు 25 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.

Liger Censor Report
Vijay Deverakonda

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి..7 కట్స్ తో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ‘U/A ‘ సర్టిఫికెట్ ఇచ్చారు..ఈ చిత్రం రన్ టైం రెండు గంటల 20 నిముషాలు ఉంది..అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియచేశారట..సినిమా అద్భుతంగా వచ్చిందని..ముఖ్యంగా సెకండ్ హాఫ్ అదిరిపోయింది అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారట..విజయ్ దేవరకొండ ని ఈ సినిమా మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చినట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Sita Ramam: ‘సీతారామం’ సినిమాని మన టాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసా

Liger Censor Report
Vijay Deverakonda

మాములుగా పూరి జగన్నాథ్ తో సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , రవితేజ వంటి హీరోల కెరీర్స్ సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి చేరుకున్నాయి..వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న యంగ్ హీరో రామ్ కి కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరుగులేని మాస్ ఇమేజి ఇచ్చాడు..ఇప్పుడు లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ కి కూడా అలాంటి ఇమేజి వస్తుందని బలంగా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్..మరి ఇది ఎంత వరుకు నిజమో మనం వారం రోజుల్లో తెలుసుకోబోతున్నాము.

Also Read:Oscars 2023 RRR : ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ కు కశ్మీర్ ఫైల్స్ గట్టి పోటీ!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version