
కర్ణాటకలో బయటపడ్డ డ్రగ్స్ కేసు లింకులు తెలంగాణ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటూనే ఉన్నాయి. విచారణలో భాగంగా ఈ డ్రగ్స్ కేసులు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉన్నారని తేలడంతో ఎవరు వారు? అన్న ఆసక్తి తెలుగు రాజకీయాల్లో నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సందీప్ విచారణలో భాగంగా ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరి పేర్లు తెలిపినట్లు సమాచారం. అయితే ఆ ఎమ్మెల్యేల్లో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. ఓ ఎమ్మెల్యే నేరుగా కొకైన్ తీసుకువెళ్లినట్లు సందీప్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
సీనీ ప్రముఖులతో పాటు తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు డ్రగ్స్ వ్యవహారంలో పాలు పంచుకున్నట్లు విచారణలో తేలింది. అయితే ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా విచారించి అసలు గుట్టు విప్పనున్నారు.. దీంతో డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరనేదానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటికీ ఆ తరువాత ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా సందీప్ రెడ్డీ ఎమ్మెల్యేల ప్రస్తావన తీసుకురావడంతో హాట్ టాపిక్ గా మారింది.
సందీప్ రెడ్డి, కలహార్ రెడ్డి లు కలిపి పలు వ్యాపారాలు చేస్తున్నారు. బెంగుళూరులో వీరికి హోటల్స్, పబ్ లు ఉన్నాయి. అలాగే కన్నడ సినీ పరిశ్రమతో వీరికి సంబంధాలున్నాయి. వీరు సినిమాలకు ఫైనాన్స్ చేశారు. వీరు శంకర్ గౌడ్ తో కలిసి ఫైనాన్స్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే కలహార్ రెడ్డి ప్రజాప్రతినిధులకు పార్టీలు ఇచ్చేవాడు. ఓసారి ఇచ్చిన పార్టీలో ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు సందీప్ తెలిపాడు.
కొన్ని రోజుల కిందట బెంగుళూరు పోలీసులు నైజీరియన్స్ ను పట్టుకొని విచారించారు. దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. ఆ సమయంలో నైజిరియన్స్ సినీ ఇండస్ట్రీకి చెందిన సందీప్, కలహార్ రెడ్డి, శంకర్ గౌడ్ లకు డ్రగ్స్ సరఫరా చేశారని తెలిపారు. దీంతో పోలీసులు వీరితో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలకు నోటీసులు పంపారు. కాగా కలహార్ రెడ్డి, శంకర్ గౌడ్ లు తప్పించుకు తిరుగుతున్నారు. అయితే బెంగుళూరు పోలీసుల అదుపులో ఉన్న సందీప్ రెడ్డిని పోలీసుల విచారించగా తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధించి పలు సంచలన విషయాలు చెప్పాడని తెలిసింది.