https://oktelugu.com/

కవితకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్

బండ్ల గణేష్.. ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నాయి. పోయిన జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. కాంగ్రెస్ గెలవకపోతే ‘7ఓ క్లాక్ బ్లేడ్’తో గొంతు కోసుకుంటానని బండ్ల అన్న మాటలు వైరల్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక తనకు రాజకీయాలు అచ్చిరావని బండ్ల గణేష్ రాజకీయాల నుంచి వైదొలిగారు. అయితే బండ్ల పోయినా కానీ ఆయన విడిచిన జ్ఞాపకాలు మాత్రం వీడడం లేదు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 05:36 PM IST
    Follow us on

    బండ్ల గణేష్.. ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నాయి. పోయిన జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఆయన కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. కాంగ్రెస్ గెలవకపోతే ‘7ఓ క్లాక్ బ్లేడ్’తో గొంతు కోసుకుంటానని బండ్ల అన్న మాటలు వైరల్ అయ్యాయి. అయితే కాంగ్రెస్ ఓడిపోవడంతో ఇక తనకు రాజకీయాలు అచ్చిరావని బండ్ల గణేష్ రాజకీయాల నుంచి వైదొలిగారు. అయితే బండ్ల పోయినా కానీ ఆయన విడిచిన జ్ఞాపకాలు మాత్రం వీడడం లేదు.

    Also Read: గ్రేటర్ లో పవన్ అందుకే ప్రచారం చేయలేదా?

    తాజాగా నాడు బండ్ల, నేడు బండి అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సెటైర్లు వేశారు. కానీ రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ ను కవిత అనవసరంగా రాజకీయాల్లో లాగడంతో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

    తాజాగా సినీ నిర్మాత బండ్ల గణేష్ ను ఉద్దేశించి ‘జోకర్’ అంటూ కవిత విమర్శించడం వైరల్ అయ్యింది..గ్రేటర్ ఎన్నికల ఉదాహరణ చెప్పబోయి బండ్ల గణేష్ పేరును ప్రస్తావించిన కవితను కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇది సరికాదంటూ హితవు పలుకుతున్నారు. గ్రేటర్ ఎన్నికల వేళ ఈ మాటలు సంచలనమయ్యాయి. గ్రేటర్ ఎన్నికల వేళ సెటైర్ వేసే ప్రయత్నంలో ఉదాహరణలో భాగంగా గత ఎన్నికల్లో బండ్ల గణేష్ అనే ఒక జోకర్ ఉండేవాదని చెప్పుకొచ్చారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఆ లోటు కనిపిస్తోందని కవిత అన్నారు. ఇప్పుడు బండ్ల గణేష్ స్థానంలో బండి సంజయ్ కామెడీ చేస్తున్నాడని కవిత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

    Also Read: హైదరాబాద్ లో రోహింగ్యాల వేట మొదలైంది..

    తనను పొలిటికల్ కమెడియన్ గా కల్వకుంట్ల కవిత చిత్రీకరించడంపై బండ్ల గణేష్ నొచ్చుకున్నారు. ఆయన ట్విట్ట్ వేదికగా స్పందించారు. ‘తాను జోకర్ కాదని.. ఫైటర్’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం తనకు రాజకీయాలతో సంబంధం లేదని ట్వీట్ చేశారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్