బీజేపీ కార్యకర్తలపై దాడులు ఆపకుంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పై దాడి చేస్తామని బండి సంజయ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఫాంహౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు.
Also Read: హవ్వా.. బాలీవుడ్ కిడ్నాప్ సినిమా చూసి కేసీఆర్ బంధువుల కిడ్నాప్ అట?
బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోకుంటే జనగామ గడ్డ నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. వివేకానంద జయంతి జరిపితే సీఎం కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించడానికి జనగామ ఏరియా ఆస్పత్రికి వచ్చిన బండి సంజయ్.. అక్కడ లాఠీచార్జిపై బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అనంతరం పోలీస్ స స్టేషన్ ముందు నుంచి డీసీపీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. డీసీపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు గేట్ ఎక్కేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన సీఐపైచర్యలు తీసుకోకపోతే ఏం చేస్తామో చెప్పమని.. చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో వివేకానంద జయంతిని ప్రభుత్వం ఏమైనా నిషేధించిందా? అంటూ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్