https://oktelugu.com/

నేరాలకు పాల్పడటం సోనూసూద్ కు అలవాటు !

సోనూసూద్.. గత ఏడాది క్రితం ఒక విలన్.. చాల తెలుగు సినిమాల్లో నటించినా.. అతనికి ఎప్పుడూ ఇప్పుడంత గౌరవం దక్కిన పాపాన పోలేదు. కానీ, కరోనా అతని సామాజిక జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ‘రియల్‌ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే సోనూసూద్ పై తాజాగా బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) సంచలన వ్యాఖ్యలు చేసి, సోనూసూద్ ని అభిమానిస్తోన్న వారికి పెద్ద షాక్ ఇచ్చింది. నేరాలకు పాల్పడటం సోనూసూద్ కు ఓ అలవాటుగా మారిందని పేర్కొంది. […]

Written By:
  • admin
  • , Updated On : January 13, 2021 7:41 pm
    Follow us on

    Sonu Sood
    సోనూసూద్.. గత ఏడాది క్రితం ఒక విలన్.. చాల తెలుగు సినిమాల్లో నటించినా.. అతనికి ఎప్పుడూ ఇప్పుడంత గౌరవం దక్కిన పాపాన పోలేదు. కానీ, కరోనా అతని సామాజిక జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ‘రియల్‌ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే సోనూసూద్ పై తాజాగా బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) సంచలన వ్యాఖ్యలు చేసి, సోనూసూద్ ని అభిమానిస్తోన్న వారికి పెద్ద షాక్ ఇచ్చింది. నేరాలకు పాల్పడటం సోనూసూద్ కు ఓ అలవాటుగా మారిందని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా సోనూసూద్‌ వైఖరి మార్చుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మొత్తానికి ఘాటుగా విమర్శలు చేసింది.

    Also Read: మరో బయోపిక్.. ఆయన కాబట్టే ఒప్పుకుందట !

    గతంలో కూడా సోనూసూద్ తన నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్‌ లాభాలు పొందాలని భావిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్‌ డిపార్టుమెంట్‌ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని మళ్ళీ సోనూసూద్ పై బీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా బీఎంసీ సోనూసూద్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తి’’గా ఆయనను అభివర్ణించడం ఇప్పుడు హాట్ టాపిక్. ఇంతకీ ఈ ఆరోపణల్లో నిజం ఎంత ఉందనే విషయానికి వస్తే..

    Also Read: టీజర్ టాక్: గుండెను తాకేలా ‘ఉప్పెన’ వచ్చింది

    ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉన్న మాట వాస్తవం. అయితే ఈ భవనానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే హోటల్‌ గా మార్చారంటూ బీఎంసీ అధికారులు గతంలో సోనూసూద్‌కు నోటీసులు పంపించారు. అయితే తాను అన్ని అనుమతులు తీసుకున్నాను అంటూ సోనూ బీఎంసీ అభ్యంతరాలను స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించాడు. కాకపోతే, దిగువ కోర్టు ఆయన అభ్యర్థనను నిరాకరించడంతో హైకోర్టుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు, బీఎంసీని ఆదేశించగా.. అఫిడ‌విట్‌లో ఈ మేరకు ఆరోపణలు చేసింది. ఎంతో మంది అభాగ్యులను ఆదుకుని రియల్‌ హీరో అనిపించుకుంటున్న సోనూసూద్‌ పై కొంతమంది కక్ష్య గట్టి ఇలాంటి ఆరోపణలు చేపిస్తున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్