
నందమూరి నటసింహం బాలయ్యతో సినిమా అంటే అంతా ఆషామాషీ కాదు.. ఆయన సినిమాలన్నీ అయితే హిట్టు లేదా ఫట్టు అన్నట్లుగా ఉంటాయని టాలీవుడ్ లో ప్రచారం ఉంది. బాలయ్య సినిమాలు యావరేజ్ అనే టాక్ సాధారణంగా విన్పించదు. బాలయ్య కెరీర్లో ఎన్నో సూపర్ హిట్టు సినిమాలు.. బ్లాక్ బస్టర్ మూవీలు ఉన్నట్లుగానే ఫ్లాపు సినిమాలు కూడా ఉన్నాయి.
Also Read: చరణ్ తో వంశీ పాన్ ఇండియా సినిమా !
అయితే బాలకృష్ణతో ఓ సినిమా తీసిన నిర్మాత 13ఏళ్లుగా ఇంకా అప్పులు చెల్లిస్తున్నారనే వార్త నమ్మశక్యం కావడం లేదు. దీంతో ఆ నిర్మాత ఎవరు.. ఆ సినిమా ఏంటో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. బాలకృష్ణ హీరోగా నిర్మాత అప్పారావు ‘మహారథి’ అనే సినిమాను 2007లో నిర్మించారు.
ఈ సినిమాలో బాలకృష్ణతోపాటు అప్పట్లో టాప్ ప్లేసులో ఉన్న నటీనటులు నటించారు. బాలకృష్ణ సరసన మీరాజాస్మిన్.. స్నేహ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి జయప్రద ఇందులో నెగిటివ్ రోల్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్నమైన క్యారెక్టర్లో నటించారు. ‘మహారథి’ సినిమా రిలీజయ్యాక మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
తాజాగా నిర్మాత అప్పారావు ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ ‘మహారథి’ సినిమాతో తాను అప్పులపాలైనట్లు తెలిపారు. బాలయ్యతో సినిమా అనగానే చాలామంది ఫైనాన్స్ చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు. అయితే చివరి నిమిషంలో వారంతా హ్యండివ్వడంతో తానే సినిమా కోసం బయటి నుంచి అప్పులు తీసుకొచ్చి సినిమా నిర్మించినట్లు తెలిపాడు.
Also Read: తన సమాధిపై ఏం రాయలో బాలు ముందే చెప్పారట!
డబ్బులు సమకూర్చే పనిలో పడి తాను సినిమా స్క్రీప్ట్ ను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. ‘మహారథి’ దర్శకుడు పి.వాసు బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా క్యారెక్టర్స్ డిజైన్ చేయకపోవడంతో సినిమా ప్లాప్ అయిందని చెప్పాడు. ‘మహారథి’ విడుదలై 13ఏళ్లు అవుతుందని.. ఇప్పటికీ ఆ సినిమా కోసం చేసిన అప్పులు కడుతున్నానని అప్పారావు చెప్పడం గమనార్హం.