
తెలంగాణ టీడీపీ లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీ లోకి చేరుతున్నారు.తాజాగా ఎల్బీ నగర్ కు చెందిన తెరాస నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో దాదాపు రెండు వందల మంది తెరాస కార్యకర్తలతో టీడీపీ లోకి చేరారు. ఎల్బీ నగర్ ఏరియా పై మురళి మంచి పట్టు వుంది.