https://oktelugu.com/

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు

ఎన్నో ఏళ్లుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు తెరపడింది. మసీదు కూల్చివేతలో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.అద్వానీ, మురళీ మునోహర్‌‌ జోషి, ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తేల్చారు. Also Read: డబ్బులిస్తే డాక్టరేట్… తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం..? వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవని కోర్టు పేర్కొంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 1:19 pm
    Follow us on

    ఎన్నో ఏళ్లుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు తెరపడింది. మసీదు కూల్చివేతలో అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్‌.కె.అద్వానీ, మురళీ మునోహర్‌‌ జోషి, ఉమా భారతితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తేల్చారు.

    Also Read: డబ్బులిస్తే డాక్టరేట్… తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల భాగోతం..?

    వీరంతా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవని కోర్టు పేర్కొంది. నిందితులపై మోపిన అభియోగాలను సీబీఐ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే అభియోగాలన్నింటినీ కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌‌ యాదవ్‌ తీర్పులో వెల్లడించారు. విచారణలో కోర్టు 351 మంది సాక్షులను ఇప్పటివరకు సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49 మంది నిందుతులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేసు విచారణలో ఉండగానే 17 మంది మరణించారు. 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబర్‌‌ 30న కీలక తీర్పు వెలువరించింది.

    తీర్పు సమయంలో ప్రస్తుతమున్న 32 మంది నిందితులంతా కోర్టులో హాజరు కావాలని సెప్టెంబర్‌‌ 16న న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. వయోభారం కారణంగా, కరోనా కారణంగా అద్వానీ, మురళీ మనోహర్‌‌ జోషి, మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌లు కోర్టుకు హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌లకు కరోనా సోకడంతో వారు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో వారు కూడా హాజరుకాలేకపోయారు. వీరంతా తీర్పు సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఇక సాక్షి మహారాజ్‌, వినయ్‌ కటియార్‌‌, ధరమ్‌ దాస్‌, పవన్‌ పాండే, వేదాంతి, లల్లూసింగ్‌, చంపత్‌రాయ్‌లతోపాటు మిగితావారంతా కోర్టకు హాజరయ్యారు. తీర్పు సందర్భంగా సీబీఐ కోర్టు బయట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

    Also Read: కేంద్రం బిల్లులపై బాబు ఎందుకు స్పందించట్లేదు..?

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుపై ముందు నుంచి అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. రామజన్మభూమిని సాధించింది. కానీ అదే స్థలం కోసం పోరాడి తమ జీవితాన్ని ధారపోసిన ఆ పార్టీకి చెందిన సీనియర్ కురువృద్ధుల భవితవ్యంపై అందరికీ అనుమానాలు ఉండేది. తీరా.. నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించడంతో బీజేపీలో సంబురాలు మిన్నంటాయి.