ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ రసకందాయంలో పడింది. టీమిండియాకు ఊరటనిచ్చేలా విజయం కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో తడబడడంతో భారత్ కు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది.
నాలుగోరోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా జట్టుకు భారత్ ఆదిలోనే గట్టి షాక్ లు ఇచ్చింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 48, మార్కస్ హారిస్ 38 పరుగులతో ఆడుతుండగా వెంటవెంటనే ఔట్ చేసిన టీమిండియా బౌలర్లు కొద్దిసేపటికే ఫాంలో ఉన్న లబూషేన్, వేడ్ లను కూడా పెవిలియన్ బాట పట్టారు.
ఇక సీనియర్ బ్యాట్స్ మెన్ స్మిత్ 55 పరుగులతో ఆదుకున్నాడు. అతడికి గ్రీన్ 37 సహకరించాడు. వీరిద్దరూ కూడా ఔట్ కావడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా చిక్కుల్లో పడింది. 240 పరుగులకు ఆరు వికెట్లతో ఉదయం 10 గంటలకు ఆడుతోంది. కెప్టెన్ పైన్ కూడా ఔట్ అయ్యాడు.
ప్రస్తుతం స్టార్క్, కమిన్స్ ఆడుతున్నారు. మరో మూడు వికెట్లు పడితే ఆస్ట్రేలియా ఖేల్ ఖతం దుకాణం బంద్.. ఎంత త్వరగా ఆస్ట్రేలియాను ఔట్ చేస్తే భారత్ కు అంత ఈజీగా ఉంటుంది. మరి ఆ దిశగా ఏమేరకు సఫలీకృతం అవుతుందో లేదో చూడాలి.
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆధిక్యం 275 పరుగులకు చేరింది. ఈరోజంతా ఆడి 300 పరుగులకు పైచిలుకు చేసినా లక్ష్యాన్ని అందుకోవచ్చు. టీమిండియా బ్యాట్స్ మెన్ ఏం చేస్తారన్నది వేచిచూడాలి.