https://oktelugu.com/

‘హరిహర వీరమల్లు’బడ్జెట్ ను చూసి షాకవుతున్న ప్రేక్షకులు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ను చూపించాడు. అలాంటి క్యారెక్టర్ లో అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించేలా కనిపించాడు. శివరాత్రి సందర్భంగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పవన్ మూవీ సినిమా ప్రకటనతోపాటు టీజర్ విడుదలై అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసుకున్న పవన్ తరువాతి సినిమా ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ వర్గాల్లో […]

Written By: , Updated On : March 12, 2021 / 01:31 PM IST
Follow us on

Hari Hara Veeramallu Wallposters

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ ను చూపించాడు. అలాంటి క్యారెక్టర్ లో అభిమానులకు గూస్ బాంబ్స్ తెప్పించేలా కనిపించాడు. శివరాత్రి సందర్భంగా క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పవన్ మూవీ సినిమా ప్రకటనతోపాటు టీజర్ విడుదలై అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసుకున్న పవన్ తరువాతి సినిమా ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ వర్గాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. టీజర్ విడుదలయిన కొద్ది సేపటికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పనవ్ సైనికుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు.

Also Read: ‘హరిహర వీరమల్లు’ టీజర్ పై స్పందించిన చిరంజీవి

‘హరిహర వీరమల్లు’ పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ టీజర్ చూశాక దీనిపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమాకు ఎంత ఖర్చవుతుందని చర్చనీయాంశంగా మారుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. హిస్టారికల్ కాన్సెప్టు కావడంతో అందుకు తగ్గ వాతావరణం ఏర్పాటు చేయడానికి భారీగా బడ్జెట్ ను కేటాయించినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: కలెక్షన్లకు ‘శ్రీకారం’.. తొలిరోజు ఎంతంటే?

పవన్ ఈ సినిమాలో వజ్రాల దొంగ వీరమల్లుగా నటిస్తున్నట్టు సమాచారం. ఇందులో అదిరిపోయేలా మల్లయోధులతో ఫైట్ సీన్ చిత్రీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా మరిన్ని కీలక సన్నివేశాల కోసం ఎర్రకోట, ఛార్మినార్ వంటి భారీ సెట్లు వేయనున్నారట. అలాగే వీఎఫ్ ఎక్స్ ను ఉపయోగించి సాంకేతికంగా కూడా హై లెవల్లో చిత్రీకరిస్తున్నారు. దీనిక కోసం ఆరు నెలల సమయం అవసరమని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇదివరకే ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ తీశారు. ఆ సినిమా అప్పట్లో ఎంత భారీ హిట్టు కొట్టిందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈ సినిమాపై కూడా ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.