
AP Ganesh Festivals: High Court makes key decision on Vinayaka festivals in AP: ఏపీలో బహిరంగంగా గణేష్ ఉత్సవాలు చేయడాని హైకోర్టు అనుమతించలేదు. పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేం అని స్పష్టం చేసింది. ఏపీలో కరోనా.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదని ధార్మిక పరిషత్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణలో కోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా నిన్న బహిరంగంగా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
బహిరంగ ఉత్సవాలను కరోనా కారణంగా నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్ష బీజేపీ, టీడీపీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై ఎదురుదాడికి దిగుతోంది. ఏపీలో రాజకీయ వేడి రగులుకుంది. ఈ క్రమంలోనే గణేష్ ఉత్సవాల వివాదం హైకోర్టుకు ఎక్కింది. గణేష్ ఉత్సవాలపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో గణేష్ ఉత్సవాలకు అనుమతి మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని షరతులు పెట్టింది. పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేదు. ప్రైవేటు స్థలాల్లో మాత్రమే వేడుకలు నిర్వహించాలని ఆదేశించింది. పరిమితమైన సంఖ్యతో ఈ ఉత్సవాల నిర్వహణకు అభ్యంతరాలు లేవని హైకోర్టు ప్రకటించింది.
గణేష్ మండపాల వద్ద కరోనా నిబంధనలకు లోబడి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించిన హైకోర్టు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఏపీలో బహిరంగ స్థలాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. ప్రైవేటు స్థలాల్లో మాత్రమే ఉత్సవాలు నిర్వహించాలని.. పరిమిత భక్తులతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఇప్పటివరకూ పూర్తిగా కొనసాగుతున్న ఆంక్షలపై కొంత ఊరట దక్కినట్టైంది.
హైకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి షాక్ లా మారగా.. ప్రతిపక్ష బీజేపీ, టీడీపీ , జనసేన మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హైకోర్టు పూర్తి స్థాయిలో ఆంక్షల సడలింపులకు అంగీకరించలేదు. ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఈ మేరకు గణేష్ మండపాల్లో ఉత్సవాల నిర్వహణకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు.