
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్ చివరి దశలో ఉందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. ఇక వచ్చే ఏడాది పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని తమన్నా ప్లాన్ చేసుకుంటుంది. అందుకే గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలి అనుకుంటుంది. ఈ క్రమంలో ఏ ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టట్లేదు. కానీ ఈ మధ్య తమన్నాకి చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు. అందుకే బుల్లితెరపై వంటల షోకి హోస్ట్ గా ఒప్పుకుంది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ కూడా కొత్తగా ఒప్పుకుందని.. జీ5 లో రానున్న ఈ సిరీస్ లో తమన్నా ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.
ఈ సిరీస్ పూర్తిగా సినీ నేపథ్యంలో జరగనుంది. ఈ సిరీస్ లో తమన్నా ఒక ఐటమ్ గర్ల్ గా నటించబోతుంది.
ఎలాగూ ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. రూట్ మార్చి.. ఇలా బోల్డ్ పాత్రలకు ఓకే చెబుతోంది. తమన్నా మొదటి నుంచి కమర్షియల్ గానే కెరీర్ ను ప్లాన్ చేసుకుంది. అందుకే.. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్స్ అందరి కంటే.. తమన్నానే ఎక్కువ సంపాదించింది. పైగా యాడ్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా కొన్ని బ్రాండ్స్ కి ప్రమోహన్ చేసి బాగానే సంపాధిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ మధ్య ఈ ముదురు మిల్కీ బ్యూటీ ఎక్కువగా తెగ ఫ్యాషన్ షూట్ లు చేస్తోంది. ప్రతి వారం ఎదో ఒక ఫోటోషూట్ చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఈ మధ్యలో కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ.. మొత్తానికి తమన్నా బాగానే క్యాష్ చేసుకుంటుంది. కాకపోతే తమన్నా పరిధి దాటి ఎక్స్ పోజింగ్ చేస్తోంది అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. నిజానికి తమన్నా గతంలో ఎన్నడూ ఇలాంటి వ్యవహారాలు చేయడానికి ఇష్టపడలేదు.
పైగా ఆమె సోషల్ మీడియాకు, అలాగే డిజిటల్ ప్రమోషన్స్ కు చాలా దూరంగా ఉండేది. ఐతే కరోనా రాకతో యాడ్స్ ప్రమోషన్స్ అన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలా సడెన్ గా సోషల్ మీడియా ప్రమోషన్స్ కి బాగా డిమాండ్ పెరగడంతో.. తమన్నా కూడా హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు బాగా డబ్బు చేసుకుంటుంది.
మొత్తానికి తమన్నా తనకున్న పాపులారిటీని పరిపూర్ణంగా వాడుకుంటూ ముందుకుపోతోంది. అన్నట్టు తమన్నా హిందీలో కూడా అవకాశాలను వెతుక్కుంటుంది. ఎలాగూ తమన్న బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే.